శాఖలవారీగా మంత్రి మండలి నిర్ణయాలు

శాఖలవారీగా మంత్రి మండలి నిర్ణయాలు
x
Highlights

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు జరిగిన 1374వ (37వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారధి మీడియాకు వివరించారు.

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు జరిగిన 1374వ (37వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారధి మీడియాకు వివరించారు.

1. పురపాలక &పట్టణాభివృద్ధి శాఖ: MA&UD (UBS) Department ద్వారా G.O.Ms.No.246, తేదీ: 28.11.2025 న జారీ చేసిన ఆదేశాలకు (Ratification) రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ ఆదేశాల ప్రకారం, Apex Committee ఆమోదించిన రాష్ట్ర జల చర్య ప్రణాళిక (State Water Action Plan)కు సంబంధించిన 506 ప్రాజెక్టుల కోసం రూ.9,514.63 కోట్లు వ్యయంతో సవరిస్తూ పరిపాలనా ఆమోదం (Revised Administrative Sanction) మంజూరు చేయబడింది.

అలాగే, మిగిలిన 281 ప్రాజెక్టులను Lump Sum (LS) విధానంలో, సరైన ప్యాకేజీలుగా విభజించి, కొనుగోలు ప్రక్రియ (Procurement) మరియు అమలు (Execution) మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది.

2. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ: అమరావతిలోని అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దుర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, 2 గెస్ట్ హౌస్‌లతో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్‌ను ఆమోదించేందుకు APCRDA కమిషనర్‌కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

3. పురపాలక &పట్టణాభివృద్ధి శాఖ: APలోని NH-16తో అనుసంధానించే ఇంటర్‌చేంజ్‌తో పాటు యుటిలిటీలతో కూడిన బ్రిడ్జులు, అండర్‌పాస్‌లు మరియు 6-లేన్ ఎలివేటెడ్ కారిడార్‌తో E3 రోడ్ (ఫేజ్-III) విస్తరణకు సంబంధించి ప్యాకేజీ XXXXVకు L1 బిడ్‌ను ఆమోదించేందుకు చైర్‌పర్సన్ & MD, ADCL కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు లంప్‌సమ్ కాంట్రాక్ట్ (%టెండర్) కింద రెండు సంవత్సరాల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌తో రూ.532,57,25,425.48/- (+4.05% ECV విలువ కంటే అదనంగా) కాంట్రాక్ట్ విలువతో అమలు చేయబడుతుంది.

4. నీటి వనరుల శాఖ: చిత్తూరు జిల్లా కుప్పం (M)లో పలార్ నదిపై చెక్-డ్యామ్ మరమ్మతు/పునర్నిర్మాణ పనికి ఇంతకు ముందు G.O.Rt.No.135, WR (MI-R) శాఖ, తే. 21-03-2025లో రూ.1,024.50 లక్షలకు ఆమోదించిన మొత్తానికి బదులు రూ.1596.50 లక్షల సవరించిన పరిపాలనా ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ 4 చెక్ డ్యామ్‌ల మరమ్మతులు/పునర్నిర్మాణం విజయవంతంగా పూర్తి చేయడం వల్ల తీవ్ర కరువు పీడిత ప్రాంతమైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోని రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుంది మరియు నీటి లభ్యత మెరుగుపడుతుంది మరియు వ్యవసాయ పద్ధతులకు రైతులకు మద్దతు ఇస్తుంది.

శాంతిపురం మండలంలో 502 ఎకరాలు, కుప్పం మండలంలో 390 ఎకరాలు అంటే మొత్తం 892 ఎకరాల పరోక్ష ఆయకట్టు పాలార్ నదిలో మరియు చుట్టుపక్కల ఉన్న 4 చెక్ డ్యామ్‌ల కింద ప్రయోజనం పొందనుంది మరియు 1044.00 ఎకరాలకు ప్రత్యక్ష నీటి సరఫరాను అందించగలదు, దీని వలన శాంతిపురం మండలంలో 204 మంది రైతులు మరియు కుప్పం మండలంలో 89 మంది రైతులు ప్రయోజనం పొందుతారు.

5. ఆర్థిక శాఖ: తే.16.03.2025న జారీ చేసిన G.O.Ms.No.28, 30, 29&31, ఫైనాన్స్ శాఖలో DA/DR @ 3.64% చొప్పున తే.1.1.2023&01.07.2023 నుండి ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ పింఛనుదారులకు మంజూరు చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

6. గిరిజన సంక్షేమ శాఖ: గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న తెలుగు పండితులు – 227 మంది, హిందీ పండితులు – 91 మంది మరియు శారీరక విద్యా ఉపాధ్యాయులు – 99 మందిని, స్కూల్ అసిస్టెంట్ల (School Assistants) గా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

7. సాంఘిక సంక్షేమ శాఖ: తే.25.11.2025న జారీ చేసిన G.O.Ms.No.30, S.W.(SCP) శాఖలో సాంఘిక సంక్షేమ శాఖ పరిపాలనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్నిర్మాణం చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

సాంఘిక సంక్షేమ శాఖ పరిపాలనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఏర్పాటు వల్ల రాష్ట్రం అమలు చేసే ఎస్సీ సంక్షేమ పథకాల వినియోగంపై ఎస్సీ వర్గాలలో అవగాహనను పెంచుతుంది మరియు పౌర హక్కుల రక్షణ చట్టం, 1955 అమలుకు సంబంధించి ఎస్సీలలో సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు సఫాయి కర్మచారులు ఆరోగ్యకరమైన మరియు సంపన్న జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తుంది.

8. హోం శాఖ: భారత ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ (MoHA, GoI) రూపొందించిన “మోడల్ ప్రిజన్స్ ఆక్ట్, 2023” ను రాష్ట్రంలో అమలు చేసేందుకై “ది ఆంధ్ర ప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ఆక్ట్, 2025” అనే ముసాయిదా బిల్లును (Draft Bill) ఆమోదించడం, ఇందులో భాగంగా, “The Prisons Act, 1894”, “The Prisoners Act, 1900”, మరియు “The Transfer of Prisoners Act, 1950” చట్టాలను రద్దు (Repeal) చేయడం ద్వారా కొత్త చట్టాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా

ఈ బిల్లును రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేందుకు (Introduce in the State Legislature) ఆమోదం తెలిపింది.


9. ఐ & సి శాఖ : ఈరోజు పరిశ్రమలు & వాణిజ్య శాఖ తరఫున మొత్తం 14 ప్రధాన పెట్టుబడి ప్రతిపాదనలు తీసుకువస్తున్నాం. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను వేగవంతం చేసి, జిల్లాల వారీగా పరిశ్రమల వృద్ధిని ముందుకు తీసుకెళ్లే కీలకమైన నిర్ణయాయాలకు ఆమోదం లభించింది.

ఈ 14 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో మొత్తం ₹15,000 కోట్లకు పైగా పెట్టుబడిప్రవేశించనుంది. అలాగేసుమారు 1 లక్షకు పైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలుసృష్టించే సామర్థ్యం ఉంది.

ప్రాజెక్టులు సౌరశక్తి, కెమికల్, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, బయోఫ్యూయెల్స్, గ్లాస్ తయారీ, మహిళా MSME పార్కులు, మల్టీ-ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ పార్క్ లాంటి విభిన్న రంగాలను కవర్ చేస్తాయి.

రాష్ట్రానికి వచ్చే ఈ పెట్టుబడుల వలన స్థానిక యువతకు ఉద్యోగాలు, రైతులకు ప్రాసెసింగ్ విలువ పెంపు, సౌర శక్తి, బయోఫ్యూయెల్స్ వంటి గ్రీన్ టెక్నాలజీల ప్రోత్సాహం, జిల్లాల్లో పరిశ్రమల వికేంద్రీకరణ, MSME రంగానికి ప్రత్యేక ఉత్సాహం లభిస్తాయి.

10. ఐటిఈ & సి శాఖ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాంటం కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ మరియు ఐటి రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర క్యాబినెట్ 11 కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.1,421.2 కోట్ల పెట్టుబడితో, 3,057 ప్రత్యక్ష ఉద్యోగాల కల్పిన జరుగుతుంది.ప్రాజెక్టులను త్వరితగతిన నెలకొల్పేందుకు ప్రభుత్వం షరతులతో కూడిన రాయితీలను కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టులలో 7 క్వాంటం కంప్యూటింగ్ ప్రాజెక్టులు (అమరావతి క్వాంటం వ్యాలీలో), 1 ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రాజెక్టు (నాయుడు పేట లో), 3 ఐటి క్యాంపస్ ప్రాజెక్టులు (విశాఖపట్నంలో). ముఖ్యంగా, అమరావతి క్వాంటం వ్యాలీ దేశంలోనే మొదటి క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా అభివృద్ధి చేయడం పై ప్రత్యేక దృషి పెట్టడం జరుగుతుంది.

11. మౌలికవసతులు మరియు పెట్టుబడుల శాఖ: SPSR నెల్లూరు జిల్లాలో తెట్టు రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ-మోడల్ రైల్ కార్గో టెర్మినల్ స్థాపనకు చెవూరు గ్రామంలోని 153.77 ఎకరాల భూమిని న్యూఢిల్లీకి చెందిన M/s రామయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ ప్రతిపాదన ప్రకారం: 1) చెవూరు గ్రామంలో 153.77 ఎకరాల భూమిని M/s రామయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించేందుకు అనుమతించడం, 2) మొదటి దశలో చెవూరు గ్రామంలోని 153.77 ఎకరాల భూ సేకరణను పూర్తి చేసేందుకు APMB ను అనుమతించడం మరియు భూమిని APIIC కు బదిలీ చేయడం, భూ ఖర్చును సక్రమంగా సేకరించడం, 3) భారతీయ స్టాంప్స్ యాక్ట్, 1899 యొక్క సెక్షన్ 9(1)(a) కింద స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908 యొక్క సెక్షన్ 78 కింద రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు కల్పించడం, APMB మరియు APIIC మధ్య పైన పేర్కొన్న 153.77 ఎకరాల భూమి బదిలీకి, 4) APIIC యొక్క ఇండస్ట్రియల్ ల్యాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం M/s రామయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 153.77 ఎకరాల భూమిని కేటాయించేందుకు APIIC కు అనుమతించడం జరిగింది.

12. మౌలికవసతులు, పెట్టుబడుల శాఖ:

a) Autonomous Maritime Shipyard and Systems Centre స్థాపించుటకు ఎస్‌.పి‌.ఎస్‌.ఆర్‌. నెల్లూరు జిల్లా, బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో మొత్తం 29.58 ఎకరాల భూమిని (ఇందులో 7.58 ఎకరాలు వాటర్‌ఫ్రంట్ భూమి మరియు 22.00 ఎకరాలు హార్బర్ భూమి) M/s. Sagar Defence Engineering Pvt. Ltd. సంస్థకు కేటాయించుటకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

b)జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ (బోగోలు మండలం, ఎస్‌.పి‌.ఎస్‌.ఆర్‌. నెల్లూరు జిల్లా) లోని భూమిని మత్స్యశాఖ నుండి ఆంధ్రప్రదేశ్ సముద్ర పరిపాలక మండలి (AP Maritime Board) కు బదిలీ చేయుటకు అనుమతి ఇచ్చేందుకు మరియు

c)M/s. Sagar Defence Engineering Pvt. Ltd. సంస్థకు లీజ్ / అద్దెను జిల్లా కలెక్టర్ నిర్ణయించిన సక్రమ మార్కెట్ విలువ (Fair Market Value) యొక్క 6% చొప్పున వసూలు చేయుటకు, ప్రతి సంవత్సరం 5% పెరుగుదల (Escalation) తో, అలాగే 7.58 ఎకరాల వాటర్‌ఫ్రంట్ భూమిపై లీజ్ విలువకు 50% అదనపు ప్రీమియం విధించుటకు, APMB ప్రతిపాదించిన భూమి కేటాయింపు మార్గదర్శకాల ప్రకారం ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

13. YAT&C శాఖ (అంశాలు 31-36) : యువజనాభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి శాఖ (YAT&C) నుండి ముఖ్యమైన ప్రతిపాదనలను మంత్రిమండలిఆమోదించింది. ఈ నిర్ణయాలు రాష్ట్రాన్ని ప్రీమియం పర్యాటకం మరియు క్రీడల గమ్యస్థానంగా చేయడానికి, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడానికి తీసుకున్న వ్యూహాత్మక చర్యలు. వీటి ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, వేలాది ఉద్యోగాలు సృష్టించడం మరియు రాష్ట్ర గుర్తింపును పెంపొందించడం లక్ష్యంగా ఉంది.

ఆమోదించిన ప్రణాళికల ముఖ్యాంశాలు:

1.నాలుగు ప్రధాన పర్యాటక హోటల్ ప్రాజెక్టులకు ఆమోదం – విశాఖపట్నం, బాపట్ల మరియు తిరుపతిలో నాలుగు ప్రముఖ హాస్పిటాలిటీ ప్రాజెక్టులకు భూమి కేటాయింపు మరియు ప్రోత్సాహకాలు ఆమోదించబడ్డాయి. ఇందులో అంతర్జాతీయ బ్రాండెడ్ 5-స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, లగ్జరీ రిసార్ట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం ₹784.39 కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది మరియు 4,300 కి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయి.

2. క్రీడలకు గౌరవం – 2025లో భారతదేశం మొదటిసారిగా గెలిచిన ICC మహిళల ప్రపంచ కప్‌లో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన అంతర్జాతీయ క్రికెటర్ శ్రీమతి ఎన్. శ్రీ చరణి గౌరవార్థం ₹2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో గృహ స్థల కేటాయింపు మరియు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత గ్రూప్-I ప్రభుత్వ ఉద్యోగం మంజూరు చేయడం జరుగుతోంది. ఈ ప్రతిపాదన రాష్ట్రం క్రీడల పట్ల ఉన్న నిబద్ధతను చాటుతుంది.

3. సుదీర్ఘకాలిక ప్రాజెక్ట్‌కు పరిష్కారం – M/s ముమ్తాజ్ హోటల్స్ లిమిటెడ్ పేరును M/s స్వర హోటల్స్ లిమిటెడ్‌గా మార్చి, తిరుపతిలో ఓబెరోయ్ విలాస్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణానికి ప్రత్యామ్నాయ భూమి కేటాయింపును మంత్రిమండలి ఆమోదించింది. ఈ నిర్ణయం ద్వారా ₹250 కోట్ల పెట్టుబడి మరియు సుమారు 1,500 ఉద్యోగాలు సృష్టించడానికి దారితీస్తుంది.

ప్రయోజనాలు:

1. విశాఖపట్నం, తిరుపతి, బాపట్ల వంటి ప్రధాన పర్యాటక కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు బలోపేతం.

2.ప్రపంచ స్థాయి MICE సౌకర్యాలతో కన్వెన్షన్, వివాహ పర్యాటకాన్ని ప్రోత్సహించడం.

3. స్థానిక ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి మరియు హాస్పిటాలిటీ శిక్షణలో పెరుగుదల.

4.పెట్టుబడులకు అనువైన మరియు క్రీడలకు ఆదరించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పెంపు.

14. రెవెన్యూ శాఖ: YSR కడప జిల్లా కొండపురం మండలం లోని కొప్పోలు గ్రామంలో Ac.5.00 Cts మరియు చమలూరు గ్రామంలో Ac.10.00 Cts, T.కోడూరు గ్రామంలో Ac.30.00 cts అంటే సర్వే నెం.995, 996 మొదలైన వాటిలో Ac.45.00 cts ప్రభుత్వ భూమిని లీజు ప్రాతిపదికన 27 MW విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం హైదరాబాద్‌కు చెందిన NREDCAP మరియు M/s హెటెరో విండ్ పవర్ (పెన్నార్) Pvt Limited కు అనుకూలంగా బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది.

a) విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం గ్రామీణ మండలం, పరదేశిపాలెం గ్రామంలో గల భూములలో

సర్వే నంబర్ 168/3లో 0.24 ఎకరాలు ప్రభుత్వ భూమి మరియు సర్వే నంబర్ 203/5లో 0.50 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు (APHB) భూమి, మొత్తం 0.74 ఎకరాలు భూమిని ఆమోదా పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం అనుకూలంగా కేటాయించే ప్రతిపాదనకు మరియు

b) అదే గ్రామంలోని సర్వే నంబర్ 168/1లో 0.64 ఎకరాలు ప్రభుత్వ భూమిని, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు (APHB), విజయవాడ అనుకూలంగా మార్పిడి (Exchange) చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

MIG లేఅవుట్‌ల అభివృద్ధి కోసం ఏలూరు జిల్లా ఏలూరు అర్బన్ మండలం లోని సనివరాపుపేట గ్రామంలో RS.Nos.2/1, 3/1 మొదలైన వాటిలో Ac.36.41 cts విస్తీర్ణంలో ప్రభుత్వ భూమిని MA&UD డిపార్ట్‌మెంట్ కు అనుకూలంగా బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ భూమి విలువ మొత్తంగా ₹36,41,00,000/- (ప్రతి ఎకరాకు ₹1,00,00,000 చొప్పున × 36.41 ఎకరాలు) చెల్లింపు ప్రాతిపదికన బదిలీ చేయబడుతుంది.

15. ఇంధన శాఖ:

AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద అనంతపురము జిల్లాలోని కనేకల్ &బొమ్మనహళ్లి (M) గ్రామాల్లో 152 MW విండ్ మరియు 148 MW AC/ 200 MWp DC సోలార్ సామర్థ్యంతో కూడిన 300 MW విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ కేటాయింపు కోసం M/s. గనేకో త్రీ ఎనర్జీ Pvt Ltd. అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024కింద మదకాసిరా &గుడిబండ మండల్స్ మరియు సమీప గ్రామాలలో, శ్రీ సత్యసాయి జిల్లాలో 1700 MW AC / 2125 MWp DC సోలార్ పవర్ ప్రాజెక్ట్‌తో పాటు ఎనర్జీ స్టోరేజ్ కేటాయింపు కోసం M/s. చింతా గ్రీన్ ఎనర్జీ Pvt. Ltd. అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ ప్రతిపాదన ప్రకారం: a) 1700 MW AC / 2125 MWp DC సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను కేటాయించడం, b) సోలార్ సామర్థ్య అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న రెవెన్యూ భూమిని PSP కాంపోనెంట్‌ల క్యాప్టివ్ యూజ్ కోసం లీజు ప్రాతిపదికన 30 సంవత్సరాల కాలానికి ఎకరాకు రూ.31,000 చొప్పున, ప్రతి రెండు సంవత్సరాలకు 5% పెంపుదలతో అనుమతించడం, c) ప్రాజెక్ట్ అభివృద్ధిని స్పెషల్ పర్పస్ వెహికల్స్ (SPVs), అనుబంధ సంస్థలు, అసోసియేటెడ్ ఎంటిటీలు లేదా గ్రూప్ కంపెనీల ద్వారా దశల వారీగా చేపట్టడం, d) 24 నెలల్లో సోలార్ పవర్ సామర్థ్య అభివృద్ధి, e) ప్రయోజనాలు మరియు ఇన్సెంటివ్‌లను విస్తరించడం మరియు తదుపరి ఏవైనా సవరణలు చేయడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శుద్ధ ఇంధన విధానం – 2024 (AP Integrated Clean Energy Policy 2024) కింద, M/s. Shreshtta Renewables Pvt. Ltd. సంస్థ చేసిన వినతిపై a) చిత్తూరు జిల్లా, కుప్పం మండలంలోని కృష్ణదాసనపల్లి గ్రామంలో 10 TPD (టన్నులు ప్రతి రోజు) కంప్రెస్డ్ బయోగ్యాస్ (Compressed Biogas) కేటాయింపుకు మరియు b) ఆ సంస్థకు ప్రోత్సాహకాలు (Incentives) మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది

ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (NREDCAP) వైస్ చైర్మన్ &మేనేజింగ్ డైరెక్టర్ ప్రతిపాదన మేరకు నెలకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగం కలిగిన 27.2 లక్షల వెనుకబడిన వర్గాల (Backward Class) వినియోగదారులకు, 2 కిలోవాట్‌పీ (KWp) వరకు సామర్థ్యం గల రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం, MNRE (కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ) అందించే CFA (Central Financial Assistance) తో పాటు, అదనంగా రూ.20,000/- సబ్సిడీ మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది

ఈ సబ్సిడీ ప్రధాన మంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన (PM-Surya Ghar: Muft Bijli Yojana) కింద 2 కిలోవాట్‌పీ వరకు సామర్థ్యం గల రూఫ్‌టాప్ సౌర ప్లాంట్ల సంస్థాపనకు వర్తిస్తుంది. ఈ పథకానికి సుమారు ₹5,445.7 కోట్ల అంచనా వ్యయంగా నిర్ధారించబడింది.

బలిమెల (చిత్రకొండ) డ్యామ్ టో పవర్ హౌస్ (2X30 MW) మరియు జాలపుట్టి డ్యామ్ టో పవర్ హౌస్ (3X6 MW) అనే రెండు ప్రాజెక్టులను M/s ఒరిస్సా పవర్ కన్సార్టియం లిమిటెడ్ (OPCL)కు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories