బీజేపీలో చేరిన బైరెడ్డి, బిగ్‌బాస్ విన్నర్ కౌశల్

బీజేపీలో చేరిన బైరెడ్డి, బిగ్‌బాస్ విన్నర్ కౌశల్
x
Highlights

రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుమార్తె, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ సుభారి, అలాగే ప్రముఖ నటుడు, బిగ్‌బాస్-2 విజేత...

రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుమార్తె, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ సుభారి, అలాగే ప్రముఖ నటుడు, బిగ్‌బాస్-2 విజేత కౌశల్ భార్య నీలిమతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఢిల్లీ వెళ్లిన వీరంతా బీజేపీ జాతీయ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాంమాధవ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నడ్డా వీరికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

కాగా టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఆ తరువాత టీడీపీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2014 ఎన్నికల సమయంలో నంద్యాల పార్లమెంటుకు పోటీ చెయ్యాలని భావించారు. కానీ కుదరకపోవడంతో దూరంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.. కానీ టిక్కెట్ హామీ లేకపోవడంతో చేరలేదు. దాంతో 2018 లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అక్కడా ఇమడలేక సరిగ్గా 2019 సాధారణ ఎన్నికలకు పదిరోజుల ముందే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి.. టీడీపీకి జై కొట్టారు. ఇదే సమయంలో ఆయన వైసీపీని సంప్రదించారు. కానీ ఆయన తమ్ముడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీలోనే ఉన్నారు. పెదనాన్న రాకను ఆయన వ్యతిరేకించారు. దాంతో చేసేదేమి లేక నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన తాజాగా బీజేపీలో చేరారు.

ఇటు కౌశల్ కూడా 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరాలని చంద్రబాబును కలిశారు. అప్పట్లో అనకాపల్లి ఎంపీ టికెట్టు అడిగినట్టు ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. తాజాగా సతీమణితో సహా బీజేపీలో చేరిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories