ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లపట్టాలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు

ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లపట్టాలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు
x
Highlights

ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లపట్టాలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో సమీక్ష చేపట్టారు. అర్హులైన పేదలందరికీ...

ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లపట్టాలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో సమీక్ష చేపట్టారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని....అర్హులు ఎంతమంది ఉన్నా...వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. ఇళ్లపట్టాలు ఇస్తున్న స్థలాల పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు లబ్ధిదారులకు ఆవాస యోగ్యంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా అధికారులకు ఆదేశించారు.

ఇక ఇది ఇలా ఉంటే జగన్ రాష్ర్ట వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రామ స్థాయిలో రచ్చబండ తరహా కార్యక్రమం చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు పని తీరుపై ప్రజల నుంచి నేరుగా తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories