Top
logo

అనంతపురంలో ట్రావెల్‌ బస్సు బోల్తా

అనంతపురంలో ట్రావెల్‌ బస్సు బోల్తా
Highlights

అనంతపురంలో ట్రావెల్‌ బస్సు బోల్తా అనంతపురంలో ట్రావెల్‌ బస్సు బోల్తా

అనంతపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన పామురాయి గ్రామ సమీపంలో జరిగింది. దీంతో 15 మందికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. బెంగుళూరుకు చెందిన కారుణ్య(28), శిరీష(30), అవంతి(25) అనే యువతులకు తీవ్ర గాయాలవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను పోలీసులు అక్కడి స్థానికుల సహాయంతో బయటికి తీసి రక్షించారు. అనంతరం జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడివున్న బస్సును పక్కకు తొలగించారు.

Next Story