కులభేదాలు లేని హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యం

కులభేదాలు లేని హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యం
x
Highlights

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో గ్రామంలోని చిన్నజీయర్ ఆశ్రమం సభామండపంలో ఆదివానం నిర్వహించిన హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది.

సీతానగరం: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో గ్రామంలోని చిన్నజీయర్ ఆశ్రమం సభామండపంలో ఆదివానం నిర్వహించిన హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. కులభేదాలు లేని హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని వక్తలు వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా నిర్వహించారు.

హిందూ ధర్మపరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని వక్తలు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్రా శివన్నారాయణ సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. వేగంగా మార్పు చెందుతున్న సమాజంలో జీవిత విలువలను కలిసికట్టుగా కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి మఠం పీఠాధిపతులు భక్తి సుందర మంగళ మహరాజ్ స్వామి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించి మానవులను మహనీయునిగా మలుస్తుందన్నారు.

ముఖ్య వక్త ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ నవీన్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. నవీన్ మాట్లాడుతూ హిందూ ధర్మంలో తల్లికిగల ప్రముఖ స్థానాన్ని , కుటుంబ బాధ్యతల్లో మాతృమూర్తుల పాత్రని వివరించారు. కార్యక్రమ ప్రారంభంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల గీతాలాపన అలరించాయి. స్థానికులు భారీ స్థాయిలో పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని కృష్ణకుమార్, పుట్టా భాస్కర్ తదితరులు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories