ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభానికి సిద్ధం : బుగ్గన

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభానికి సిద్ధం : బుగ్గన
x
Highlights

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు సత్వరమే చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్లు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ను కలిసిన బుగ్గన.. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి చర్చించారు.

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు సత్వరమే చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్లు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ను కలిసిన బుగ్గన.. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి చర్చించారు. వైజాగ్ ఎయిర్ పోర్టు, నేవల్ ఎయిర్ పోర్టు నుంచి నూతన ఎయిర్‌పోర్ట్‌కు మార్పు విధివిధానాలపై చర్చించామన్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు డీజీసీఏ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించామని వెల్లడించారు. వచ్చే నెలలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభిస్తామని.. ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి లైసెన్స్ ఫీజులు తదితర అంశాలకు సంబంధించి మినహాయింపులు కోరామన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories