Buddha Venkanna: నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్న.. చంద్రబాబు నాతో తిట్టించలేదు

Buddha Venkanna Comments On Kesineni Nani
x

Buddha Venkanna: నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్న.. చంద్రబాబు నాతో తిట్టించలేదు

Highlights

Buddha Venkanna: సొంత తమ్ముడి భార్యపై ఎవరైనా కేసులు పెడతారా..?

Buddha Venkanna: బెజవాడ రాజకీయం మరింత వేడెక్కింది. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్న ఎంపీ కేశినేని నాని.. చంద్రబాబుతో పాటు బుద్దా వెంకన్నపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో నాని ఆరోపణలను తిప్పికొట్టారు బుద్దా వెంకన్న. కేశినేని నాని వైసీపీ కోవర్టు అని బుద్దా వెంకన్న కౌంటర్ ఎటాక్ చేశారు. తన పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా చంద్రబాబు నాతో కేశినేని నానిని తిట్టించలేదని బుద్దా వెంకన్న వివరణ ఇచ్చారు. గత ఎన్నికల్లో నువ్వు సొంతంగా గెలిచావా అంటూ కేశినేని నానిని ఉద్దేశించి ధ్వజమెత్తారు. సొంత తమ్ముడి భార్యపై కేసులు పెట్టించిన ఘనత కేశినేని నానిది అన్నారు బుద్దా వెంకన్న.

Show Full Article
Print Article
Next Story
More Stories