ఎడ్లబండిపై హస్తిన బాట.. చెల్లెలుకు న్యాయం కోసం కదిలిన అన్న...

Brother Going to Hastina by Bull Cart to File Complaint in Supreme Court for Justice to His Sister | AP News
x

ఎడ్లబండిపై హస్తిన బాట.. చెల్లెలుకు న్యాయం కోసం కదిలిన అన్న...

Highlights

AP News: *స్పందించిన ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ *వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని లేఖ

AP News: చెల్లికి న్యాయం కోసం ఓ అన్న హస్తిన బాట పట్టాడు. సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసేందుకు ఎడ్లబండిపై ఈనెల 23న పయనం అయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాల గ్రామానికి చెందిన నేలవెల్లి నాగదుర్గారావు చెల్లెలు నేలవెల్లి నవ్యతను అదే మండలంలోని చందపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్ర నాథ్‌కు ఇచ్చి 2018లో వివా‌హం చేశారు. కట్నంగా 23లక్షలు రూపాయలు, 320 గ్రాముల బంగారం ఆభరణాలు, మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు.

వివాహం జరిగినప్పటి నుండి భర్త తనతో సరిగా ఉండటం లేదని ఆడబిడ్డ మధుర స్రవంతికి తెలిపింది. బయటికి చెప్పొద్దని... అన్నకు వైద్యం చేయిస్తామని స్రవంతి తెలిపింది. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఆమె జర్మనీ వెళ్లిపోయింది. కొంగర నరేంద్రనాథ్ కుటుంబ సభ్యులు మానసికంగా బెదిరించి బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారన్నారని సోదరుడు దుర్గారావు తెలిపారు. జరిగిన ఉదంతంపై చందర్లపాటు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.

ఘటనపై తమకు న్యాయం జరగాలని ... కొంగర నరేంద్ర నాథ్ కుటుంబ సభ్యుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ ఎడ్ల బండికి ఏర్పాటు చేశారు. ఈ విషయంపై నరేంద్రనాథ్ కుటుంబ సభ్యులు తమపై 50లక్షలు పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. తమ కుటుంబానికి న్యాయం కోసం తల్లితోకలిసి ఎడ్లబండిపై ఢిల్లీ బాటపట్టారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. హెచ్ఆర్సీని ఆశ్రయిస్తామని యువతి సోదరుడు నాగదుర్గారావు వెల్లడించారు.

న్యాయం జరగలేదని ఎడ్లబండిపై ఢిల్లీకి ప్రయాణం కట్టిన యువతి కుటుంబానికి ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ బాసటగా నిలిచింది. వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎన్టీఆర్ జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ లేఖ రాసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories