క్వారంటైన్‌లో కేర్ అద్భుతం.. జగన్ సర్కార్‌పై బ్రిటన్ పౌరుడి లేఖ

క్వారంటైన్‌లో కేర్ అద్భుతం.. జగన్ సర్కార్‌పై బ్రిటన్ పౌరుడి లేఖ
x
Highlights

ఏపీలో క్వారంటైన్‌లో ఉన్న అధికారులపై బ్రిటన్ పౌరుడు ప్రశంసలు కురిపించాడు. కరోనా క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు.

ఏపీలో క్వారంటైన్‌లో ఉన్న అధికారులపై బ్రిటన్ పౌరుడు ప్రశంసలు కురిపించాడు. కరోనా క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు.క్వారంటైన్ ముగిసిన తర్వాత భారత్ నుంచి యూకే వెళ్లడానికి అనుమతి వచ్చిన తర్వాత కల్లీ క్లైవ్ బ్రయాంట్ అధికారులను ప్రశంసిస్తూ ఓ లేఖ రాశాడు.

బ్రిటన్‌లోని వేల్స్ రాష్ట్రానికి చెందిన కల్లీ క్లైవ్ బ్రయాంట్ తిరుపతిలో శ్రీ పద్మావతి నిలయం వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. దీంతో అక్కడ అధికారులు, వైద్య సిబ్బంది, బాగా చూసుకున్నారని.. క్వారంటైన్ సెంటర్‌లో టిఫిన్, భోజనం, డిన్నర్ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో గాలి, వెలుతురు వచ్చేలా.. విశాలమైన బెడ్‌లు ఉన్నాయన్నారు. పరిసరాలు అన్ని చాలా పరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. తిరుపతి ప్రకృతి కనువిందు చేసిందని తెలిపాడు.

వైద్య సిబ్బంది స్నేహపూర్వకంగా ఉన్నారని, వాట్సాప్‌లో అడిగిన వెంటనే టీ, స్నాక్స్, మంచినీళ్లు, అందించారన్నారు. వైద్యులు కూడా మంచి ట్రీట్ మెంట్ అందించారన్నారు.. ఎలాంటి ఆందోళన చెందొద్దని అందరిలో ధైర్యం నింపారన్నారు.మళ్లీ తాను తిరుపతి శ్రీవారిని దర్శించుకుంటానని తనను బాగా చూసుకున్న అధికారులను మళ్లీ కలుస్తానని చెప్పారు.

కల్లీ క్లైవ్ బ్రయాంట్ 2019 అక్టోబర్‌లో భారత పర్యటనకు వచ్చారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనానికి కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించింది భారత ప్రభుత్వం. కెల్లీ బ్రిటన్ విదేశీయుడు కావడంతో మార్చి 24న తిరుపతిలోని పద్మావతి నిలయంలో క్వారంటైన్‌కు తరలించారు. క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. ఆయన శాంపిల్స్ పరీక్షించగా.. రెండు సార్లు కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. ఏప్రిల్ 17వ తేదీన హైదరాబాద్ నుంచి విమానంలో అహ్మదాబాద్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రాత్రి 7 గంటలకు బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ ద్వారా బ్రిటన్ వెళ్తారు.







Show Full Article
Print Article
More On
Next Story
More Stories