British Commissioner Congratulates YS Jagan: ఏపీ సీఎంకు కంగ్రాట్స్​ చెప్పిన బ్రిటిష్ డిప్యూటి హైకమిషనర్..

British Commissioner Congratulates YS Jagan: ఏపీ సీఎంకు కంగ్రాట్స్​ చెప్పిన బ్రిటిష్ డిప్యూటి హైకమిషనర్..
x
Highlights

British Commissioner Congratulates YS Jagan: రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక 108, 104 వాహనాలు అందుబాటులో ఉంచనున్నారు. ఎక్కడైన ప్రమాదం అని ఫోన్ వచ్చిన 15, 20 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకోనున్నాయి

British Commissioner Congratulates YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో రూ. 203 కోట్ల ఖర్చుతో ఒక వెయ్యి 88 , 108, 104 వాహనాలను కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక 108, 104 వాహనాలు అందుబాటులో ఉంచనున్నారు. లాంఛనంగా ఇవాళ వాటిని ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాజెక్టులో సౌత్​ సెంట్రల్​ అంబులెన్స్​ సర్వీసు పాలు పంచుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు.

108 అత్యవసర అంబులెన్స్​ సర్వీసులు, 104 మొబైల్​ మెడికల్​ యూనిట్ల ప్రాజెక్టుల్లో టెక్నికల్​, లీడ్​ పార్టనర్లుగా ఉన్న అరబిందో ఫార్మా,... యూకేకి చెందిన నేషనల్​ హెల్త్​ సర్వీసులో భాగమైన సౌత్ సెంట్రల్​ అంబులెన్స్​ సర్వీసులకు కూడా ఆండ్రూ ఫ్లెమింగ్‌ అభినందనలు తెలిపారు.

ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో జెండా ఊపి ప్రారంభించారు

రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక 108, 104 వాహనాలు అందుబాటులో ఉంచనున్నారు. ఎక్కడైన ప్రమాదం అని ఫోన్ వచ్చిన 15, 20 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకోనున్నాయి ఈ వాహనాలు. ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసే వీలు ఉంటుంది. అంతేకాదు ప్రతి అంబులెన్సులోనూ ఒక కెమెరా, ఒక మొబైల్‌ డేటా టెర్మినల్‌, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ బాక్స్‌ను ఏర్పాటు చేశారు.

కొత్తగా సిద్ధంగా ఉన్న 412 అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టుకు సంబంధించినవి. 104 వాహనాలను అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టుతో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు వైద్య సేవలందించేలా తయారు చేశారు. ఈ వాహనాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బీఎల్‌ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ చైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీపారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఏఎల్‌ఎస్‌ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో వైద్య సేవలందించేలా లెటెస్ట్ టెక్నాలజీతో కూడిన వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇటు చిన్నారులకు వైద్యం అందించే నియోనేటల్‌ కేర్ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు వెంటిలేటర్లను తీర్చిదిద్దారు



Show Full Article
Print Article
Next Story
More Stories