పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిని బలితీసుకున్న డెంగీ..

పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిని బలితీసుకున్న డెంగీ..
x
Highlights

కొద్దిరోజుల్లో ఆమె వివాహం.. కాబోయే పెళ్లికూతురు రాబోయే కొత్త జీవితంపై కలలు కంటూ.. సంసారం జీవితంపై అందమైన ఆశలు పెంచుకుంది. కానీ విధి ఆడిన వింతనాటకంలో...

కొద్దిరోజుల్లో ఆమె వివాహం.. కాబోయే పెళ్లికూతురు రాబోయే కొత్త జీవితంపై కలలు కంటూ.. సంసారం జీవితంపై అందమైన ఆశలు పెంచుకుంది. కానీ విధి ఆడిన వింతనాటకంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. పెళ్లి పీటలు ఎక‍్కాల్సిన ఆమెను డెంగీ జ్వరం బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం టీవీఎన్‌ఆర్‌పురంలో జరిగింది. గ్రామానికి చెందిన కృష్ణంరాజు, రెడ్డెమ్మల కుమార్తె కావ్య (18)కు గత నెల 30న పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఆమెకు డెంగీ జ్వరం వచ్చింది.

దాంతో పెళ్లి వాయిదా వేసుకున్నారు ఆమెను చికిత్స నిమిత్తం తమిళనాడులోని షోళింగర్‌ ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి వేలూరులోని అడుకుంబారై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినా ఆమె కోలుకోలేదు.. తీవ్రమైన జ్వరం కారణంగా ఆ యువతి శుక్రవారం మృతి చెందింది. దాంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన కుమార్తెను శ్మశానానికి పంపించాల్సి వచ్చిందంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం పలువురిని కంటతడిపెట్టించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories