Andhra Pradesh: విజయవాడలో కరోనా నిబంధనలకు తూట్లు

Break To Corona Rules in Vijayawada Andhra Pradesh
x

చికెన్ షాప్ వద్ద బారులుతీరిన జనాలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: నాన్‌వెజ్‌ మార్కెట్లో భౌతిక దూరం పాటించని జనాలు * మాస్క్‌ ధరించకుండానే వ్యాపారుల అమ్మకాలు

Andhra Pradesh: విజయవాడలో నాన్‌వెజ్‌ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఆదివారం కావడంతో జనాలు నాన్‌వెజ్‌ కోసం బారులు తీరారు. ముఖ్యంగా చికెన్‌ మార్కెట్లు జనాలతో నిండిపోయాయి. అయితే.. ప్రజలు మాత్రం ఎక్కడా కూడా కరోనా నిబంధనలు పాటించడం లేదు.

రాష్ట్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నా అవేవి పట్టించుకోకుండా మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు భౌతిక దూరం ఎందుకు పాటించడం లేదని ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారు.

ప్రధానంగా విజయవాడలో కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. నాన్‌వెజ్‌ మార్కెట్లలో జనాలు కరోనా నిబంధనలు పాటించకపోయినా చోద్యం చూస్తున్నారు. ముఖ్యంగా అమ్మకం దార్లు మాస్కు ధరించకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories