ప్రేయసి పిలిచిందని హాస్టల్ కి వెళ్ళాడు.. చివరకి..

ప్రేయసి పిలిచిందని హాస్టల్ కి వెళ్ళాడు.. చివరకి..
x
'ప్రతీకాత్మక చిత్రం'
Highlights

సినిమాను తలదన్నేలా ఓ యువకుడు తన ప్రేయసి కోసం సాహసం చేసి అడ్డంగా దొరికిపోయాడు.

సినిమాను తలదన్నేలా ఓ యువకుడు తన ప్రేయసి కోసం సాహసం చేసి అడ్డంగా దొరికిపోయాడు. 'నువ్‌..మగాడివైతే అర్ధరాత్రి హాస్టల్‌కి రా..ఫోన్‌ చెయ్‌ వస్తా..' అని ప్రేయసి ఆఫర్ ఇవ్వడంతో మన మన్మధుడు గాల్లో తేలిపోయాడు. దాంతో ప్రేయసి కోసం స్పైడర్‌ మాన్‌ లా మారి గోడలు ఎగబాకాడు.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన భానుప్రసాద్‌(22) పట్టణంలో పెయింటర్‌ పనిచేసే వాడు.

వారం రోజులపాటు బాలిక ఇంట పెయింటింగ్ పని చేశాడు. దాంతో బాలికను ముగ్గులోకి దించాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి హాస్టల్‌లో ఉంటున్న ఆ బాలిక 'నువ్‌..మగాడివైతే అర్ధరాత్రి హాస్టల్‌కి రా..ఫోన్‌ చెయ్‌ వస్తా' అని ఆఫర్ ఇచ్చిందట.

దాంతో భానుప్రసాద్‌ విమెన్ హాస్టల్ లోకి వెళ్లే ప్రయత్నం చేసినట్లు అతడు వెల్లడించాడు. హాస్టల్‌ గోడకు ఉన్న పైపుల ద్వారా ఎగబాకి రెండో అంతస్తుకు చేరుకున్నానని.. అక్కడ చీకటి ప్రదేశం నుంచి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా వాచ్‌మెన్‌ గమనించాడని.. దాంతో అతడు గమనించి గట్టిగ అరవడంతో గదుల్లో ఉన్న విద్యార్థినులు భయంతో పరుగులు తీశారని చెప్పాడు.

సమాచారం అందుకున్న సీఐ శ్రీధర్‌ మహిళా ఎస్‌ఐ ప్రియాంక, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పోలీసు వాహనం చూసి ప్రేమికుడికి చమటలు పట్టాయి. పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి తహసీల్దార్‌ ద్వారా సీఐ బైండోవర్‌ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories