విశాఖలో మంత్రి బొత్స సడన్ విజిట్..

విశాఖలో మంత్రి బొత్స సడన్ విజిట్..
x
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు
Highlights

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం పరిశీలించారు.

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం పరిశీలించారు.ప్రస్తుతం జరుగుతున్న సర్వే గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాజువాక, కొమ్మాది మెట్రో రైలుకు అనువైన మార్గమని అధికారులు ఆయనకు వివరించారు. ఇప్పటికే సర్వేకు అవసరమైన నిధులను సమీకరించామని రివ్యూ మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు.

తొందరలోనే నగరవాసులకు మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని మంత్రి బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, విఎంఆర్‌డిఎ చైర్మన్ ద్రోణమరాజు శ్రీనివాస రావు, జివిఎంసి కమిషనర్ జి. శ్రీజన, విశాఖపట్నం ఎంపి ఎం.వి.వి. సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories