అమరావతిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

అమరావతిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
x
బొత్స సత్యనారాయణ
Highlights

అమరావతిపై శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అమరావతిపై స్పందిచారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతిపై శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతిలో భూములిచ్చిన రైతుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. తెలుగుదేశం హయంలో రైతుల నుంచి భూములు సేకరించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని, అలాంటి ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు.

ప్రతి అంశంలోనూ బాధ్యతగా పనిచేస్తున్నాం, టీడీపీ ప్రభుత్వంలో చేసినట్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ చేయమని, రాజధాని అంశంలో సినిమాలు, గ్రాఫిక్స్ చూపించం అన్ని అంశాల్లో వాస్తవాలే చెబుతామన్నారు. అమరావతిలో 50శాతం నిర్మాణాలు దాటిన భవనాలను పూర్తి చేస్తామని తెలిపారు. రైతులకు ఎలాంటి భయాందోళన అక్కర్లేదని అమరావతిలో రైతులను నుంచి సేకరించిన 33వేల ఎకరాలను త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 3 ప్రాంతాల్లో రాజధానికి ఎంత ఖర్చవుతుందో మంత్రిమండలి సమావేశం తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.

సీఎంగా ఐదేళ్లు చేసిన చంద్రబాబు అమరాతిలో ఇల్లు కట్టుకోలేదో చెప్పాలన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చంద్రబాబుకు ఎలాంటి చిత్రశుద్ధి ఉందని ప్రశ్నించారు. అమరావతిలో రూ.5,458 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసిందిని రాష్ట్రాన్ని వేల కోట్ల అప్పు్ల్లో ముంచి చంద్రబాబు లక్షల కోట్లకు తీసుకెళ్లారని విమర్శించారు.

టీడీపీ నేతలు ప్రాంతాలు వారిగా భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబులా రైతులను మోసం చేయబోం. ఐదేళ్లలో తెదేపా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. రాష్ట్ర ఆదాయం మేరకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాలని, గత ఐదేళ్ళలో కేంద్రం రాజధానికి 1500 కోట్లు మాత్రమే కేటాయించిందని, టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం కన్సల్టెంట్లు రూ.340 కోట్లు ఇచ్చిందిని వెల్లడిచారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల ఆధారంగా ముందుకెళ్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories