చెన్నై, ముంబై, ముప్పు లేదా? విశాఖ కొట్టుకుపోతుందా : బొత్స

చెన్నై, ముంబై, ముప్పు లేదా? విశాఖ కొట్టుకుపోతుందా : బొత్స
x
బొత్స సత్యానారా‍యణ ఫైల్ ఫోటో
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి బొత్స సత్యానారాయణ.

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి బొత్స సత్యానారాయణ. జీఎన్‌రావు కమిటీ , బోస్టన్‌ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించాకే మూడు రాజధానులపై ఓ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అమరావతిలో మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. ఈ సందర్భంగా జీఎన్‌రావు కమిటీ నివేదికను విమర్శించిన చంద్రబాబు మళ్లి యూటర్న్ తీసుకొని.. జీఎన్‌రావు కమిటీ విశాఖలో రాజధాని అయితే ప్రకృతి వైపరిత్యాలు వస్తాయని చెప్పిందంటూ తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని విమర్శించారు. తన మీడియాలతో కలిసి చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు.

తుఫాన్లతో విశాఖ పెద్దగా నష్టం ఉండదని అమరావతికే వరద ముప్పు పొంచి ఉందని తెలిపారు. ఐదేళ్లకో, పదిఏళ్లకో భారీ వరదలు వస్తాయని చెన్నై ముంబయి నగరాలకు ముప్పు లేదా? అని బొత్స అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మండలి వ్యవహరించవద్దని మండలి ఛైర్మాన్ షరీఫ్ ను తాము కోరామని ఆయన అన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తెకు హత్యకు సంబంధించిన వ్యవహారం న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుదని స్పష‌్టం చేశారు.

చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని బొత్స విమర్శించారు. చంద్రబాబు యూటర్న్‌ తీసుకుంటారని, యూటర్న్‌ చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. శాసనమండలి రద్దుకు మూడు రాజధానులకు సంబంధం లేదని మంత్రి బొత్స సత్యానారాయణ స్పష్టం చేశారు. వివేకానంద రెడ్డి కుమార్తెకు ఆవేదన ఉండటం తప్పుకాదని తెలిపారు. అమ్మఒడి పథకం పాఠశాలల అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండాలనే వేయి రూపాయిలు సీఎం కోరారని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారేందుకు సిద్ధమని బొత్స విమర్శించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories