బోస్టన్ నివేదిక : రాజధాని విషయంలో రెండు ఆప్షన్స్

బోస్టన్  నివేదిక : రాజధాని విషయంలో రెండు ఆప్షన్స్
x
విజయ కుమార్
Highlights

రాజధాని విషయంలో రెండు ఆప్షన్ కేటాయించింది. బోస్టన్ నివేదిక కూడా ముడు రాజధానులకు జైకొట్టింది.

రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏపీ ప్రణాళికా కార్యదర్శి విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. విశాఖ నుంచి చైన్నెకు రోడ్డు మార్గం ఉంది. అమరావతి అభివృద్ధికి లక్షకోట్లు అవసరమని, కృష్ణా తీరంలో రాజధాని నిర్మాణం చెపడితే ముంపుకు గురైయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పర్యటక ప్రాంతంగా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉంది. ఏ వనరులు ఉన్నాయో పరిశీలించిందని,ఆంధ్రప్రదేశ్ లో 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని తెలిపారు. కృష్ణా-గోదావరి బేసిన్ లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి అధికంగా ఉందని, 50 శాతం అగ్రికల్చర్ ఉత్పత్తి కేజీ బేసిన్ ద్వారా ఉందని, ‎తలసరి ఆదాయంలో ఏపీ వెనకబడి ఉందని నివేదికలో పేర్కొన్నట్లు విజయ్ కుమార్ తెలిపారు.

ఆప్షన్-1

రాజధాని విషయంలో రెండు ఆప్షన్ కేటాయించింది. ఆప్షన్-1 కింద గవర్నర్, సీఎం కార్యాలయాలు, అలాగే సచివాలయం విశాఖలో ఏర్పాటు చేయాలని అత్యవసర సమావేశాలు కూడా విశాఖలో ఏర్పాటు చేయాలని సూచించింది. అమరావతిలో హైకోర్టు బెంచ్, వ్యవసాయ, ఎడ్యూకేషన్ హబ్ , శాసనసభ, కర్నూలులో హైకోర్టు, పలు శాఖధిపతి కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.

ఆప్షన్-2

ఆప్షన్-2 కూడా తెలిపింది. విశాఖలో సెక్రటరియేట్, ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ శాఖలు, అత్యవసర సమావేశాలు కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, ఏర్పాటుచేయాలని, కర్నూలులో హైకోర్టు, రాష్ట్ర కమిషనర్ కార్యాలయం, అప్పిలేట్ సంస్ఠలు ఏర్పాటు చేయాలి తెలిసింది.

రాష్ట్రంలో కొత్తగా 5 ఎక్స్‌ప్రెస్ వేలను ఏర్పాటు చేయాలని సూచించింది.హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా కర్నూలును , బెంగళూరు‌కు ప్రత్యామ్నాయంగా అనంతపురం అభివృద్ధి చేయాలని తెలిపింది. రాష్ట్రంలోని తాగు, సాగునీటి ప్రాజెక్టులపై లక్ష 76 వేల కోట్లు ఖర్చవుతుందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు రూ.33 వేల కోట్లు, వాటర్ గ్రిడ్‌కు రూ.48 వేల కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.16 వేల కోట్ల ఖర్చవుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలో తెలిపిందని విజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర రీజియన్‌లో మెడికల్ హబ్, టూరిజం, కృష్ణాలో సిరమిక్స్, ఫిషరీస్, ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని తెలిపింది. మచిలీపట్నం పోర్ట్ ఇన్ ఫ్రా రంగానికి కేటాయించాలని పేర్కొంది. అంతే కాకుండా దక్షిణాంధ్రలో ఆటోమోటివ్, లెదర్, పేపర్, ఫిషరీస్ పరిశ్రమలు రావాలని, రాయలసీమలో గోదావరి పెన్నా అనసంధానం హైవే మార్గం ఉండాలిన తెలిపింది. కోల్డ్ స్టోరేజ్ సంఖ్య పెంచాలని పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories