ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేస్తారా..?

ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేస్తారా..?
x
Highlights

వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ఒక్కసారిగా నైరాశ్యం నెలకొంది. విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వలేదన్న కారణంతో రాజీనామా చేశారు రాధా. అయితే ఈ...

వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ఒక్కసారిగా నైరాశ్యం నెలకొంది. విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వలేదన్న కారణంతో రాజీనామా చేశారు రాధా. అయితే ఈ పరిణామం నాలుగు నెలల కిందటే ఏర్పడినా.. రాధా వేచి చూశారు. గత శనివారమే వైసీపీ పెద్దలు రాధాకు ఫైనల్ మాట చెప్పేశారు. దాంతో ఆయన నిన్న(జనవరి 20)న వైసీపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాధాకు మద్దతుగా కొంతమంది కార్పొరేటర్లు అలాగే పార్టీ నేతలు రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ లిస్టులో బొప్పన భవకుమర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఆయన రాధాకు అత్యంత సన్నిహితుడు. రాధాను సెంట్రల్ నియోజకవర్గానికి ఇంచార్జ్ గా మార్చిన తరువాత భవకుమర్ ను విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇంచార్జ్ గా నియమించింది వైసీపీ. ఈ నియామకం రాధా కనుసన్నల్లోనే జరిగింది. రాధా పట్టుబడితేనే భవకుమర్ ను ఇంచార్జ్ గా నియమించింది. అయితే టీడీపీ నేత యలమంచిలి రవి చేరికతో పరిస్థితి మారిపోయింది. ఇక్కడ ఇంచార్జ్ గా రవిని నియమించారు జగన్. ఈ పరిణామం భవకుమర్ కు నచ్చలేదు. దాంతో ఆయన కూడా అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి భువకుమార్.. రాధా లా పార్టీకి రాజీనామా చేస్తారో లేక సర్దుకుపోతారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories