Top
logo

బొండా ఉమా, పార్థసారధి రాజీనామా

బొండా ఉమా, పార్థసారధి రాజీనామా
X
Highlights

టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, బీకే పార్థసారధి లు టీటీడీ పాలకమండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరి ...

టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, బీకే పార్థసారధి లు టీటీడీ పాలకమండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను టీటీడీతో పాటు ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. కాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీటీడీ సభ్యత్వాన్ని వదులుకున్నారు.

కాగా, తాజా ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నుంచి బొండా ఉమామహేశ్వరరావు, అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యత్వాలకు రాజీనామా చేయకుంటే వారి నామినేషన్లు తిరస్కరించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story