కచ్చలూరు బోటు ప్రమాదానికి 30 రోజులు... ఇంకా నది గర్భంలోనే బోటు

కచ్చలూరు  బోటు ప్రమాదానికి 30 రోజులు... ఇంకా నది గర్భంలోనే బోటు
x
Highlights

-బోటు ప్రమాదం జరిగి నేటికి నెల రోజులు -మృతదేహాలు లభ్యమైనా, గుర్తు పట్టలేని స్థితిలో ఉంటాయి -గత నెల 15 న గోదావరిలో మునిగిన బోటు -ఇప్పటివరకు దొరికిన 38 మంది మృతదేహాలు -ఇంకా లభ్యం కాని 13 మంది ఆచూకీ

తూర్పుగోదావరి జిల్లాలోని కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిపోయి నేటికి నెలరోజులయ్యింది.‎ ఇంకా బోటు గోదావరి నది గర్భంలోనే ఉంది. సెప్టెంబర్ 15న కచ్చలూరు వద్ద రాయల్ వశిష్ట బోటు గోదావరిలో మునిగిపోయింది. పాపికొండలు విహార యాత్రకు బయల్దేరిన యాత్రికులు 77 మంది‎ ప్రమాదానికి గురైయ్యారు. వారిలో 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటి వరకు 38 మృతదేహాలను వెలికితీయగా, మరో 13 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం రెండుసార్ల ప్రయత్నించింది. లంగర్లు వేసి బోటును వెలికితీసేందుకు సత్యం బృందం ప్రయత్నం చేసినప్పటికి, నదిలో ఉన్న బోటు బరువు ఎక్కువగా ఉండడంతో సాధ్యపడలేదు. మృతదేహాలను వెలికితీసినా వాటిని ఎవరూ గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాయి. వారు ధరించిన దుస్తుల ఆధారంగా మృతదేహాలను గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. మృతదేహాలు బయటకుతీసి కుంటుంబ సభ్యులు అప్పగించాలంటే డీఎన్ఏ పరీక్షల ద్వారా చేయాల్సి వస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories