Sriharikota: షార్ లో రక్తదాన శిబిరం

Sriharikota: షార్ లో రక్తదాన శిబిరం
x
Highlights

షార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో, అమరుడైన శ్రీ అపోలు శ్రీకాంత్ రెడ్డి సంస్మరణార్ధం నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు.

శ్రీహరికోట: షార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో, అమరుడైన శ్రీ అపోలు శ్రీకాంత్ రెడ్డి సంస్మరణార్ధం నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. షార్ ఇన్ చార్జికంట్రోలర్ ఎస్ పీపీ డిప్యూటీ డైరెక్టర్ వి.రంగనాథన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కంట్రోలర్ వి.రంగనాథన్ మాట్లాడుతూ... షార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వాళ్ళు ఏన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ... ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీహరికోట పరిధిలో, ఇరవై రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్న మనోజ్ కి చికిత్స కోసం, మీకోసం మేము ఫౌండేషన్, ఏ.శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కలిసి ఇరవై వేల రూపాయలు అందించారు.

ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా 224 యూనిట్ లు రక్త దానం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో షార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యనిర్వహక సభ్యులు అసోసియేషన్ అధ్యక్షుడు జి.మునిరాజ, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కటరీ శ్రీకాంత్, కార్యదర్శి ఎం.ప్రసాద్ మరియు స్ర్కబ్ డీజీఎం ఎల్ .శ్రీనివాసులు, ఎం ఎస్ ఈ.గోపికృష్ణ కమాండెంట్, శ్రీనివాసులురెడ్డి ,షార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు,మీకోసం మేము ఫౌండేషన్ సభ్యులు మరియు బ్లడ్ బ్యాంక్ సభ్యులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories