జగన్ ప్రభుత్వ తీరుతో రూ.1400 కోట్లు వృథా : ఏపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు..

జగన్ ప్రభుత్వ తీరుతో రూ.1400 కోట్లు వృథా : ఏపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు..
x
Highlights

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వెంటనే తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వెంటనే తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే రంగులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల గడువు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు హైకోర్టు దీనికి అంగీకరించి గడువిచ్చింది. అయితే, ఈ వ్యవహారంపై జగన్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. హై కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ సర్కారు తీరును ఎండగట్టారు.

కన్నా లక్ష్మీనారాయణ పెట్టిన పోస్ట్ యధాతదం గా..

అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైకాపాకు పట్టుకున్న రంగుల పిచ్చికి కోర్టులో చుక్కెదురైంది. బోరు పంపుల నుంచీ స్మశానవాటికలో సమాధులకు కూడా రంగులేశారు. చెట్టూపుట్టా దగ్గర మొదలెట్టి, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామసచివాలయలు.. చివరకు విజ్ఞత మరిచి జాతీయ జెండా తొలగించి పార్టీ రంగులు వేశారు.

పరాకాష్టకు చేరింది వైసీపీ రంగుల రాజకీయం. ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేయడం అక్రమం అంటూ బీజేపీ ఎన్నోసార్లు హెచ్చరించినా సుమారు 1400 కోట్లు దుర్వినియోగం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇపుడు రంగులు మార్చడానికి ఎంత వృధా చేయనున్నారో? ఇకనైనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకండి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories