బీజేపీలోనే పురందేశ్వరి.. రాజకీయాలకు దూరంగా దగ్గుబాటి!

బీజేపీలోనే పురందేశ్వరి.. రాజకీయాలకు దూరంగా దగ్గుబాటి!
x
Highlights

బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగానున్నట్టు సమాచారం. మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరావు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలని

బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగానున్నట్టు సమాచారం. మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరావు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కానీ కుమారుడిని మాత్రం వైసీపీలోనే కొనసాగేలా సీఎం జగన్ తో మాట్లాడతారని తెలుస్తోంది. సీఎం జగన్‌ షరతు నేపథ్యంలో కుమారుడి రాజకీయ భవితవ్యంపై మల్లగుల్లాలు పడిన దగ్గుబాటి చివరికి రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అమెరికా నుంచి పురందేశ్వరి గురువారం హైదరాబాద్‌ చేరారు. కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కుమారుడు హితేష్‌ రాజకీయ భవితవ్యం కోసమే దగ్గుబాటి వెంకటేశ్వరావు ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఈ మేరకు ప్రజలకు లేఖ రాయాలని దగ్గుబాటి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా భవిష్యత్‌ కార్యాచరణపై నియోజకవర్గంలోని దగ్గుబాటి అనుచరులు నేడు పర్చూరులో సమావేశం అవుతున్నారు.

ఇదిలావుంటే దగ్గుబాటి దంపతులు చెరో పార్టీలో ఉండడం సరికాదని సీఎం జగన్ అభిప్రాయపడినట్టు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పర్చూరు కార్యకర్తలతో చెప్పిన సంగతి తెలిసిందే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురందేశ్వరి ఒకే పార్టీలో ఉండాలని, వైసీపీలోకి పురందేశ్వరిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని.. పార్టీలో చేరితే సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని జగన్ అభిప్రాయపడ్డారని బాలినేని ఇటీవల చెప్పారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి కుటుంబం అలోచించి ఈ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories