రాజధాని అంశంపై స్పందించిన బీజేపీ అగ్రనేత.. వారి అభిప్రాయాలు ఇలా..

రాజధాని అంశంపై స్పందించిన బీజేపీ అగ్రనేత.. వారి అభిప్రాయాలు ఇలా..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ప్రస్తుతం కన్ఫ్యూజన్ నెలకొన్నట్టయింది. ఆ పార్టీ జాతీయ నేతలేమో రాజధాని అన్న అంశం రాష్ట్ర పరిధిలోనిది అంటుంటే.. రాష్ట్ర నేతలు మాత్రం కదిలిస్తే తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ప్రస్తుతం కన్ఫ్యూజన్ నెలకొన్నట్టయింది. ఆ పార్టీ జాతీయ నేతలేమో రాజధాని అన్న అంశం రాష్ట్ర పరిధిలోనిది అంటుంటే.. రాష్ట్ర నేతలు మాత్రం కదిలిస్తే తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజధాని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని ఆయన తెలియజేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని తేల్చేశారు. అధికారాన్ని, అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరింపజేయడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు.

విశాఖ, కర్నూలు నగరాల్లో పాలన విస్తరించడం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో బీజేపీకి ఇప్పటికే స్పష్టమైన విధానంతో ఉందని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు లు రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రాజధానికి సంబంధించిన కార్యాలయాలు అన్ని అమరావతిలోని కొనసాగాలని.. కావాలంటే అభివృద్ధిని వికేంద్రీకరించాలని వారు పేర్కొంటున్నారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నట్టు అర్ధమవుతోంది.

కన్నా లక్ష్మీనారాయణ మాత్రం అమరావతి కేంద్రంగానే పాలన సాగాలని అంటున్నారు. ఇటు సుజనా చౌదరి మాత్రం మరో అడుగు ముందుకేసి అమరావతిని ఒక్క అడుగు కూడా కదిలించలేరని.. కదిలిస్తే కేంద్రం జోక్యం చేసుకుంటుందని బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర బీజేపీ నేతలు మాత్రం విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడాన్ని స్వాగతిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను స్వాగతిస్తున్నామని.. అదేక్రమంలో అమరావతి రైతులకు కూడా న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. ఇలా బీజేపీలో రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండంతో కార్యకర్తలు కన్ఫ్యూజన్ లో పడిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories