2014లోనే జగన్ సీఎం అవ్వాల్సింది : సుజనా చౌదరి

2014లోనే జగన్ సీఎం అవ్వాల్సింది : సుజనా చౌదరి
x
Highlights

2014లోనే జగన్ సీఎం అవ్వాల్సింది : సుజనా చౌదరి 2014లోనే జగన్ సీఎం అవ్వాల్సింది : సుజనా చౌదరి

బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజనా.. జగన్, చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లోనే జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సింది.. ఆ సమయంలో జగన్ కు సానుకూలతలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ రూపంలో జగన్‌ పార్టీకి ఎదురు దెబ్బతగిలిందని, అది టీడీపీకి కలిసొచ్చి జగన్ కు అధికారం దూరం అయిందన్నారు. గ్రౌండ్ స్థాయిలో బలంగా ఉన్న టీడీపీకి బీజేపీ, పవన్ వలన అధికారం దక్కిందన్నారు.

అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీని దూరం చేసుకోవడం కారణంగానే టీడీపీకి ఈ గతి పట్టిందన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించినప్పటికీ తాను భారతీయ జనతా పార్టీలో చేరేవాడినని సుజనా చెప్పారు. బీజేపీతో టీడీపీ పొత్తు కోనసాగించాలని అనుకున్న వారిలో తానూ కూడా ఒకడినని.. ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలో దేశం అభివృద్ధివైపు దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు సుజనా. కాగా టీడీపీతో రాజకీయ జీవితం ఆరంభించిన సుజనా ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories