పవన్ కళ్యాణ్‌పై బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్‌పై బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
x
GVL File Photo
Highlights

బీజేపీతో తనకు వ్యక్తిగత వైరం లేదని, దూరంగా లేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్...

బీజేపీతో తనకు వ్యక్తిగత వైరం లేదని, దూరంగా లేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాన్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. బీజేపీతో విలీన ప్రాతిపాదతో పవన్ కళ్యాణ్ వస్తే కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని తెలిపారు. ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు. బీజేపీ మద్దతు పవన్ కళ్యాణ్ కి ఇస్తామని భరోసా ఇచ్చారు.

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే జనసేన పార్టీని విలీనం చేయాలని పవన్ కళ్యాణ్‌ని కోరామని అన్నారు. పవన్ విలీనానికి అంగీకరించలేదని గుర్తుచేశారు. అయితే పొత్తులకు ఇది సమయం కాదని అభిప్రాయపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ మతసామరస్యం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను జీవీఎల్ ఖండించారు. మత సామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమన్న వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే మతల మధ్య జరిగే ఘర్షణలకు హిందువులు కారణమంటున్నారన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories