సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థం.. దుబాయ్ కి 15 విమానాలు..

సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థం.. దుబాయ్ కి 15 విమానాలు..
x
Highlights

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కుమారుడి వివాహ నిశ్చితార్థం దుబాయ్‌లో ఆదివారం జరగనుంది. నిశ్చితార్థానికి 70 మంది దాకా ఎంపీలు, టీడీపీ, బీజేపీ...

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కుమారుడి వివాహ నిశ్చితార్థం దుబాయ్‌లో ఆదివారం జరగనుంది. నిశ్చితార్థానికి 70 మంది దాకా ఎంపీలు, టీడీపీ, బీజేపీ నేతలు హాజరుకానున్నారు. వారంతా ఈ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్‌ వెళ్లారు. వారికోసం కోసం ఏకంగా 15 విమానాలను దుబాయ్ కి బుక్ చేశారు. కడప జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలకు కూడా ఆహ్వానాలు అందాయి.

వారు ఈ కార్యక్రమానికి వెళతారో లేదో అన్న అనుమానం ఉండగా.. వైసీపీ లోక్ సభా పక్ష నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరుకాకున్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు సీఎం రమేష్ సన్నిహితులు మూడు రోజుల ముందే దుబాయ్ చేరినట్టు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే దుబాయ్‌లో ల్యాండ్ అయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories