గంటా బీజేపీని సంప్రదించారు.. త్వరలో టీడీపీ ఖాళీ : సోము వీర్రాజు సంచలనం

గంటా బీజేపీని సంప్రదించారు..  త్వరలో టీడీపీ ఖాళీ : సోము వీర్రాజు సంచలనం
x
Highlights

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీని సంప్రదించారని.. త్వరలో చాలా మంది నేతలు బీజేపీలోకి...

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీని సంప్రదించారని.. త్వరలో చాలా మంది నేతలు బీజేపీలోకి వస్తారని.. అతిత్వరలోనే టీడీపీ ఖాళీ అవుతుందని తెలిపారు.శాసనసభలో తమ ప్రాతినిధ్యం తప్పకుండా ఉంటుందన్న వీర్రాజు.. ఆ 23 మందిని కలుపుకుంటామన్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలతో టీడీపీకి టెన్షన్ పట్టుకున్నట్టయింది.

గంటా తోపాటు ఇంకెంతమంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడి బీజేపీలో చేరతారో అని అప్రమత్తమైంది. ఇప్పటికే సీనియర్లను రంగంలోకి దింపింది. ఏ ఏ నేతలు పార్టీని వీడాలనుకుంటున్నారో వివరాలు సేకరించింది. వారిని బుజ్జగించే బాధ్యతను చేపట్టింది. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు వ్యాఖ్యలతో మరింత దూకుడు పెంచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories