ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు దీక్ష భగ్నం

ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు దీక్ష భగ్నం
x
Highlights

బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు దీక్ష భగ్నం చేశారు పోలీసులు. 2014 ఎన్నికల సందర్బంగా తాడేపల్లి గూడెం...

బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు దీక్ష భగ్నం చేశారు పోలీసులు. 2014 ఎన్నికల సందర్బంగా తాడేపల్లి గూడెం కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదంటూ.... నిరసనగా రెండురోజుల పాటు నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నారాయన. దీంతో ఆయన ఆరోగ్యం విషమించింది. ఈ కారణంగా ఆయన దీక్షను భగ్నం చేసి.. బలవంతంగా అంబులెన్స్‌లోకి ఎక్కించారు.

ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు దీక్ష భగ్నంఈ క్రమంలో దీక్ష వేదిక వద్ద కొద్దిసేపు పోలీసులకు- బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాణిక్యాలరావును అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీవార్డులో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు వైద్యులు. దీక్ష భగ్నానికి వ్యతిరేకంగా ఏరియా ఆస్పత్రి వద్ద బీజేపీ కార్యకర్తలు కొందరు ఆందోళన నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories