జనసేనలో చేరిన మరో ఎమ్మెల్యే

జనసేనలో చేరిన మరో ఎమ్మెల్యే
x
Highlights

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. బలమైన క్యాడర్ కలిగిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి...

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. బలమైన క్యాడర్ కలిగిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు టీడీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరారు. తాజాగా భాజపాకి చెందిన రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇవాళ(జనవరి 21) పవన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సత్యనారాయణకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పవన్‌. అంతకుముందు జనసేన పార్టీలో చేరడానికి నేడు ఉదయం భారీ ర్యాలీతో విజయవాడకు బయలుదేరారు. ఎమ్మెల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆకుల సత్యనారాయణ తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణకు పంపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories