సీఎం జగన్ నిర్ణయం అద్భుతం : విష్ణుకుమార్ రాజు

సీఎం జగన్ నిర్ణయం అద్భుతం : విష్ణుకుమార్ రాజు
x
Highlights

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయం వివాదం నడుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ...

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయం వివాదం నడుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ వ్యతిరేకిస్తుండగా, ఆ పార్టీకి చెందిన కొందరు దీనికి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారు. ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ విద్యకు మద్దతు పలికారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం అద్భుతమైన నిర్ణయం అని విష్ణు కొనియాడారు.

జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. అయితే, ఇంగ్లీష్ మాధ్యమాన్ని అమలు చేసేటప్పుడు తెలుగును నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఈ నిర్ణయాన్ని తమ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు వ్యతిరేకించారో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. సీఎం అప్పాయింట్మెంట్ కోసం ఆరుసార్లు ప్రయత్నించినప్పటికీ కుదరలేదని చెప్పారు. ఇసుక కొరత గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని, నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని పునరుద్ఘాటించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నప్పటికీ సిమెంట్ కంపెనీలు ధరలను పెంచాయని అన్నారు. సిమెంటు ధరలపై సీఎం దృష్టి పెట్టాలి అని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories