సీఎం జగన్ పై సాధినేని యామిని తీవ్ర విమర్శలు

సీఎం జగన్ పై సాధినేని యామిని తీవ్ర విమర్శలు
x
Yamini Sadineni (File Photo)
Highlights

ప్రస్తుతం లాక్ డౌన్ మే 17వరకు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. అందులో ప్రధాన ఆదాయ వనరు మద్యం విక్రయాలు.

ప్రస్తుతం లాక్ డౌన్ మే 17వరకు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. అందులో ప్రధాన ఆదాయ వనరు మద్యం విక్రయాలు. అయితే ఈ సమయంలో రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకోవడంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ సర్కారుకు ప్రాధాన్యతలు తెలియడం లేదని బీజేపీ నేత యామిని శర్మ విమర్శలు గుప్పించారు. మద్యం షాపులు తెరిస్తే కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆదాయం కోసం కేంద్రం ప్రభుత్వం పై వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయని యామిని సాధినేని అన్నారు. కేంద్రం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చినా... రాష్ట్రాలు ఎందుకు వాటిని అమలు చేయలని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి వైన్స్ షాపులు తెరుచుకున్నాయి. ఈ సారి పెరిగిన మద్యం రేట్లు మందుబాబులకు షాక్ ఇస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయింత్రం 7 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్ ఉంటాయి. ఒక్కసారి అయిదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని, షాపుల వద్ద సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు.మాస్క్ లేనిదే మద్యం దుకాణాలకు అనుమతి లేదని వెల్లడించారు. మద్యం అమ్మకాలు తగ్గించే క్రమంలో భాగంగా ధరలను25 శాతం పెంచుతున్నట్లుగా వెల్లడించారు. ఇప్పటికే మద్యం అమ్మకాలపై మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్ కి పంపినట్టు రజిత్ భార్గవ్ తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories