వంశీనే కాదు.. గంటా శ్రీనివాసరావు కూడా సంప్రదిస్తున్నారు: బీజేపీ నేత రఘురాం

వంశీనే కాదు.. గంటా శ్రీనివాసరావు కూడా సంప్రదిస్తున్నారు: బీజేపీ నేత రఘురాం
x
Highlights

టీడీపీకి, శాసనసభ్యత్వానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేత రఘురాం మాట్లాడుతూ.. వల్లభనేని వంశీతో...

టీడీపీకి, శాసనసభ్యత్వానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేత రఘురాం మాట్లాడుతూ.. వల్లభనేని వంశీతో పాటు టీడీపీ మరో నేత గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీ, వైసీపీని సంప్రదిస్తున్నారని బాంబ్ పేల్చారు. ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసిన వంశీ బీజేపీ, వైసీపీతో చర్చించే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

బీజేపీలో చేరాల్సిన నేతలు దైర్యంగా చేరవచ్చని వైసీపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరే నేతలకు తాము అండగా ఉంటామని చెప్పారు రఘురాం. ఏపీలో ప్రస్తుతానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ... భవిష్యత్తు బీజేపీదేనని జోశ్యం చెప్పారు. మచ్చ లేని నేతలు తమ పార్టీలోకి రావచ్చని స్వాగతిస్తామని.. స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారేవారిని మాత్రం నమ్మవద్దని హెచ్చరించారు రఘురాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories