స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంకండి: కన్నా లక్ష్మీనారాయణ

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంకండి: కన్నా లక్ష్మీనారాయణ
x
Highlights

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

విజయవాడ: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ... కృష్ణా, గుంటూరు జిల్లాల బీజేపీ నాయకులు క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ణాలని అన్నారు.

అనంతరం జనసేనతో పొత్తు కారణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రధాని మోదీ పాలన, కేంద్రం అమలు చేస్తున్న పథకాలు గ్రామాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. వైసీపీ ఎనిమిది నెలల పాలనలో వైఫల్యాలు,పెన్షన్ ల రద్దు వంటిని ప్రజలకు‌ వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి పురంధరేశ్వరి,ఇతర ముఖ్య నాయకులు, అన్ని నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories