ఆయన వైసీపీలోకి వెళతారా..?

ఆయన వైసీపీలోకి వెళతారా..?
x
Highlights

సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్నందున ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాయి ప్రధాన పార్టీలు. అందులో టీడీపీ, వైసీపీలు ముందున్నాయి. ఈ...

సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్నందున ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాయి ప్రధాన పార్టీలు. అందులో టీడీపీ, వైసీపీలు ముందున్నాయి. ఈ ఎన్నికలు వైసీపీకి కీలకంగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను చేర్చుకుంటోంది. తాజాగా రాయలసీమ బీజేపీలో బలమైన నేతగా గుర్తింపు పొందిన చల్లపల్లి నరసింహారెడ్డిని వైసీపీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలలో ఆయనకు బలమైన క్యాడర్ ఉంది. గత వారం రోజులుగా చల్లపల్లి నరసింహారెడ్డి బీజేపీని వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నరసింహారెడ్డి ఖండించనూలేదు, ఎటువంటి ప్రకటనా చేయలేదు.

వాస్తవానికి 2014 కు ముందే చల్లపల్లికి వైసీపీలో చేరాలని ఆహ్వానం అందింది. అయితే అప్పట్లో ఆయన బీజేపీలో ఉండటానికే మొగ్గుచూపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు నరసింహారెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆయన మాట కాదని నరసింహారెడ్డి ఏ నిర్ణయం తీసుకోరన్న అభిప్రాయం ఉంది. ఒకవేళ చల్లపల్లి పార్టీ మారినా.. మదనపల్లి నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం మదనపల్లిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా దేశాయ్ తిప్పారెడ్డి ఉన్నారు. ఆయనకే మళ్ళీ టికెట్ ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో నరసింహారెడ్డికి టికెట్ దక్కకపోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారా లేక బీజేపీలోనే కొనసాగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories