విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం

BJP Focus on Andhra Pradesh
x

విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం

Highlights

Andhra Pradesh: ఏపీలో భారీ యాక్షన్ కు ప్లాన్ సిద్ధం

Andhra Pradesh: ఆంద్రప్రదేశ్ పై భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేస్తుంది. భారీ యాక్షన్ ప్లాన్ కు సిద్దం చేసింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. రాష్ర్ట వ్యాప్తంగా మరో సుధీర్ఘ యాత్రకు రెడీ అవుతుంది. విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పెండిగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం విధానాలపై పోరాటాని సిద్ధం కావాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ పూర్తి ఫోకస్ చేస్తోంది. భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. వచ్చే ఎన్నికల్లో నాటికి ఏపీలో బలపడడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరో సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. విజయవాడ (Vijayawada) లో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో దీనిపై బీజేపీ నేతలు (BJP Leaders) నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చేపట్టిన జలం కోసం జనయాత్రకు మంచి స్పందన వచ్చిందని, దీంతో ఈసారి రాష్ట్రవ్యాప్త యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు ఆ పార్టీ నేత, ఎంపీ జీవీఎల్ (GVL) ప్రకటించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మరో యాత్రకు రాష్ట్ర బిజేపీ శ్రీకారం చుట్టబోతోంది. ఈ భారీ యాత్రకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు (Somu Veerraju) ఈ యాత్రకు నాయకత్వం వహిస్తారు. దీంతో పాటు బీజేపీ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆ కార్యచరనలో భాగంగా 175 నియోజకవర్గాల్లో 5 వేల సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎంపీ జీవీఎల్ తెలిపారు. ఇందులో మోదీ ప్రజా పాలన, జగన్ ప్రజా కంఠక పాలన ను వివరిస్తామని జీవీఎల్ తెలిపారు.

సెప్టెంబరు 17నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టనున్నారు. అలాగే సెప్టెంబరు 25వ తేదీన దీన్ దయాళ్ జయంతి నిర్వహిస్తామన్నారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాల పై బిజెపి అక్టోబర్ ఐదు వరకు కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గం లో బిజెపి సొంతం గా తన శక్తి పెంచుకుంటుందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి జగన్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బిజెపి బలపడుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

సోము వీర్రాజు అధ్యక్షతన బిజెపి పదాధికారుల సమావేశం. పాల్గొన్న శివప్రకాష్ జీ, జీవియల్, సునీల్ దేవ్ ధర్, కన్నా లక్ష్మీనారాయణ, సత్యకుమార్, వాకాటి నారాయణ రెడ్డి, మాధవ్ తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా గిడుగు రామమూర్తి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన బిజెపి నేతలు.

రాష్ట్ర ప్రభుత్వం విధానాల పై పోరాటానికి సిద్దం కావాలి హిందువులు ఏ కార్యక్రమం చేపట్టినా వినాయకుని కి పూజ చేస్తాం ఎపి లో జగన్ ప్రభుత్వం వినాయక ఉత్సవాల ఆంక్షలను బిజెపి వ్యతిరేకిస్తుంది. గతంలో కోవిడ్ పేరు చెప్పి హిందువులు పండుగలకు ఆంక్షలు పెట్టింది ఇతర పండుగలకు ఎటువంటి అనుమతి అక్కర్లేదు వినాయక చవితి కి ఫైర్, విద్యుత్, పోలీసు పర్మిషన్ తీసుకోవాలంట ఈ నిబంధనలు స్వయంగా డిజిపి నే ప్రకటించారు ఎపిలో ఇటువంటి అంశాలను బిజెపి వ్యతిరేకిస్తుంది. సిఎం జగన్మోహన్ రెడ్డి కి నేను లేఖ రాశాను కానీ కొంతమంది తాపేదారులు నా గురించి మాట్లాడతారు..జగన్ ఈ ఉత్సవాలు నిబంధనలు పై ఎందుకు స్పందించరు టిడిపి హయాంలో ఆలయాలు కూలకొడితే ఆనాడు కన్నా ఆధ్వర్యంలో మేము వ్యతిరేకించాం ఆనాడు‌ వెల్లంపల్లి కూడా మాతో పాటు పోరాటం లో పాల్గొన్నారు. ఇప్పుడు అవన్నీ మరచి వైసిపి నాయకులు ఏదేదో మాట్లాడతారు పోలవరం విషయంలో కేంద్రం తప్పు లేదు.

అంచనాలు పెరగడానికి గత, ప్రస్తుత ప్రభుత్వాలే కారణం శశిభూషణ్ ను పక్కన పెడితే.. మళ్లీ తెచ్చి పెట్టుకున్నారు ఎపికి రాజధాని లేకుండా చేసిన పార్టీ లా మమ్మలను అనేది పోలవరం పూర్తి కాకుండా చేసిన నాయకులా బిజెపి ని విమర్శించేది ఒకే వేదిక పై ఇరు పార్టీ ల నేతలతో మేము బహిరంగ చర్చకు సిద్దం మద్యం మాఫియాలో ఎవరి పాత్ర ఏంటో మాకు తెలుసుజగన్ ప్రభుత్వం వైఫల్యాల పై అనేక ఉద్యమాలు మేము చేశాంరామతీర్థం నుంచి కపిల తీర్థం వరకు ర్యాలీ మేము చేశాంమా పోరాటాలు వల్లే హిందూ ఆలయాల పై దాడులు ఆగాయికరోనా వస్తే బిజెపి కార్యకర్తలు ప్రజలకు సేవ చేశారుఅనురాగ్ ఠాగూర్ వచ్చి జగన్ అవినీతి ని ప్రశ్నించారువెంటనే జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తారుఅక్కడ ఏం జరిగిందో, ఏ హామీ ఇచ్చారో చెప్పరుఎందుకంటే అటువైపు నుంచి ఏ హామీ రాదు కాబట్టిఎపి లో ప్రభుత్వ విధానాలను బిజెపి మొదటి నుంచి తప్పు పడుతుందితెలుగు భాష పై జగన్ ప్రభుత్వానికి కనీస గౌరవం లేదుతెలుగు భాష దినోత్సవం రోజు కూడా ఇంగ్లీషు లో ప్రకటన ఇస్తారుతెలుగు భాష ఔన్నత్యాన్ని భావి తరాలకు తెలియ చెబుతాంబుల్లెట్ ట్రైన్ ద్వారా ప్రపంచ దేశాలలో ప్రత్యేకత పొందాంజగన్ కు ఐదు కిలోమీటర్లు రోడ్టు వేసే దమ్ము ఉందా నితిన్ గడ్కరి ఇచ్చిన నిధులతో గుంతలు పూడుస్తారాజగన్ ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ఒక్క బిజెపి కే ఉందిరాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాంమత్స్యకారులు కు మంచి చేస్తామని చెప్పిన జగన్ వారిని మోసం చేశాడుబెర్త్ లు కట్టకుండా...‌కనీసం నిధులు కూడా ఇవ్వలేదుఇక్కడ పని లేక వారు గుజరాత్, చెన్నై వలస వెళుతున్నారుఎపిలో మత్స్యకారులు పరిస్థితి దారుణంగా ఉందికేంద్ర ప్రభుత్వం మత్స్యకారులు, రైతులు, చేనేత కార్మికులు కు అండగా ఉంటుందిజగన్ ప్రభుత్వం లో ఇన్సూరెన్స్, రవాణా చార్జి ల పేరుతో రైతులను దోపిడీ చేస్తుందిజగన్ వైఫల్యాలను ఎండగడుతూ ఎపి లో బలీయమైన శక్తిగా గా బిజెపి ఎదుగుతుందివచ్చే ఎన్నికలలో బిజెపి అధికారమే లక్యంగా పని చేస్తాం.

రాయలసీమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చెయ్యాలని డిమాండ్ చేస్తూ మరో యాత్రకు రాష్ట్ర బిజేపీ నిర్ణయం. యాత్రకు నాయకత్వం వహించనున్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. బిజెపి బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో 25 చోట్ల బహిరంగ సభలు,సమావేశాలు చేపట్టనున్న బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానూ, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్న నాయకులు.


Show Full Article
Print Article
Next Story
More Stories