విశాఖ విమానాశ్రయంలో పక్షుల సంచారం.. విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

Birds Migration at Visakhapatnam Airport
x

విశాఖ విమానాశ్రయంలో పక్షుల సంచారం.. విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

Highlights

Visakha Airport: అపరిశుభ్రంగా ఎయిర్ పోర్టు పరిసరాలు

Visakha Airport: విశాఖ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో పక్షుల సంచారం తో విమానాల రాకపోకల కి ఇబ్బంది కలుగుతుంది. లాండింగ్ సమయంలో పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎయిర్పోర్ట్ అథారిటీ, విమానయాన ఆపరేటర్లు కలసీ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎయిర్ పోర్ట్ చుట్టూ నివాసిత ప్రాంతాలు ఉండడం, వ్యర్థాలు అధికంగా ఉంటుండడం‌తో పక్షులు అధికంగా వస్తున్నట్టు గుర్తించారు. తక్షణమే వ్యర్థాల తొలగింపు పై చర్యలు తీసుకోవాలని జీ‌వీ‌ఎం‌సీని ఆదేశించారు కలెక్టర్.

విశాఖ ఎయిర్‌పోర్ట్ పరిసరాలు, అపరిశుభ్రంగా తయారయ్యాయి. రన్ వే లో నీటి నిల్వలు ఏర్పడడం, ఎయిర్ పోర్ట్ పరిసరాలలో చెత్త డంపింగ్ చేయడం వల్ల పక్షులు పెరిగిపోతున్నాయని నిర్దారించారు. దేశ వ్యాప్తంగా పక్షుల వలన విమానాలకు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. 2021 సంవత్సరంలో 1430 ప్రమాదాలు జరగ్గా, ఇప్పుడు ఆ సంఖ్య 2174 కు పెరిగింది.విశాఖ‌లో ఎయిర్‌పోర్ట్ నివాస ప్రాంతాలకి దగ్గర‌గా ఉండటం‌తో పక్షుల తీవ్రత ఎక్కువైంది.

విశాఖ విమానాశ్రయ ప్రాంతం పూర్తిగా జనసాంద్రత కలిగిన ప్రాంతంలో ఉంది. దీంతో ఎయిర్ పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యర్థాలు చేరుతున్నాయి. జాతీయ రహదారి ప్రాంతంలో మాంసపు వ్యర్ధాలు మేఘాద్రీ గెడ్డ కాలువ వేస్తున్నారని దీని వల్ల ఈ ప్రాంతంలో పక్షులు పెరిగిపోయాయని గతంలోనే గుర్తించారు. పక్షులు పెరిగిపోయి విమానాల రాక, పోకలకు ఆటంకం కలిగిస్తున్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని ఎయిర్‌పోర్ట్, నేవీ అధికారులు జిల్లా కలెక్టర్‌కు అనేక సార్లు మొర పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఫీల్డ్ నుంచి వైమానిక కార్యకలాపాలలో ఎదురవుతున్న సవాళ్లను తెలుసుకోవడానికి సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ నేవీ, పోర్ట్ ట్రస్ట్ , జివిఎంసి , ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రతినిధులతో ఎయిర్‌ఫీల్డ్ ఎన్విరాన్‌మెంట్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జివిఎంసి కమీషనర్ సిఎం సాయి కాంత్ వర్మ తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.

విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, మాంస దుకాణాలు తొలగించాలని, పారిశుధ్యపనులు చేపట్టాలని కలెక్టర్ మల్లికార్జున్ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. క్లాప్ వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తరలించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు మేఘాద్రిగెడ్డ, కొండగెడ్డల నీరు విమానాశ్రయంలోనికి రాకుండా తగిన నిర్మాణాలు, పూడిక తీత పనులు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో నీటి నిల్వకు గల కారణాలను ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతర్గతంగా ఉన్న మూడు డ్రైనేజీ కాలువలను సవ్యంగా నిర్వహణ చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి సూచించారు. కొండ గెడ్డ పూడిక తీత కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories