పెద్ద ఉల్లిపాయలతో కన్నీళ్లే..

పెద్ద ఉల్లిపాయలతో కన్నీళ్లే..
x
Highlights

ఒక కిలో ఉల్లిపాయలు డజనుకు పైగా ఉంటాయని మీరు ఊహించుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే ఈజిప్ట్ నుండి దిగుమతి చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు ఆరు కంటే ఎక్కువ...

ఒక కిలో ఉల్లిపాయలు డజనుకు పైగా ఉంటాయని మీరు ఊహించుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే ఈజిప్ట్ నుండి దిగుమతి చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు ఆరు కంటే ఎక్కువ ఉండవు.. అక్కడ పండే ఉల్లిపాయలు చాలా ఘాటుగా , లావుగా ఉంటాయి. ఈవారం ఈజిప్ట్ నుంచి భారీగా ఉల్లిపాయలను ఏపీ ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. వాటిని సబ్సిడీ రేట్లతో వినియోగదారులకు అందిస్తున్నారు. అయితే వీటి పరిమాణం చూసి వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఈ కొత్త రకం ఉల్లిపాయలు రైతు బజార్ల నిండా ఉన్నాయి. ఇవి ఒక కేజీకి ఐదు నుండి ఆరు మాత్రమే తూగుతున్నాయి. రెండు వారాల కిందటి వరకు మహారాష్ట్ర, కర్నూలు, కడప ప్రాంతాల నుంచి ఉల్లిపాయలు వచ్చాయి. అయితే సడన్ గా దిగుమతి తగ్గడంతో ఈజిప్ట్ నుంచి భారీగా దిగుమతి చేసుకుంది. వీటిని ప్రధాన నగరాలకు పంపారు అధికారులు. సోమవారం నుంచి మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

సబ్సిడీ కాకుండా అయితే.. ప్రస్తుతం కేజీ ఉల్లి రూ.100 వరకూ పలుకుతోంది. అయితే ఇంత రేటు పెట్టి కొన్న ఉల్లిపాయలను జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. ఈ ఈజిప్ట్ ఉల్లిపాయలు మరీ లావుగా ఉండటం వలన పొదుపుగా వాడుకోవడానికి కుదరడం లేదు. మాములుగా అయితే మన ఉల్లిపాయల పరిమాణం చిన్నవిగా ఉంటాయి కాబట్టి.. కూరలో ఒకటి పూర్తిగా వేసుకున్నా ఇబ్బంది లేదు. కానీ ఈజిప్ట్ ఉల్లిపాయలు మాత్రం లావుగా ఉంటాయి.. ఒక ఉల్లిపాయ కొస్తే రెండు కూరలకు సరిపోతుంది. అలాంటిది ఒక కూరకే ఒకదాన్ని వినియోగించాలంటే మాత్రం చేతులు రావడం లేదు, అలా అని సగం ఉల్లిపాయ కోసి అలాగే ఉంచితే మాత్రం వేస్ట్ అయిపోవచ్చు. ఇది ఫ్యామిలీకి పెద్దగా ఇబ్బంది లేకపోయినా బ్యాచిలర్ ప్రజలకు మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది. అసలే ఉల్లి పాయలు చాలా కాస్ట్లీ అనుకుంటుంటే.. ఈ పెద్ద ఉల్లిపాయలతో మరింత కన్నీళ్లు వస్తున్నాయని దిగువ మధ్య తరగతి ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories