టీడీపీకి మరో భారీ షాక్‌..

టీడీపీకి మరో భారీ షాక్‌..
x
Highlights

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత...

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత చంద్రబాబునాయుడుకు పంపించారు. అసంబద్ధ వైఖరి, టీడీపీ సర్కార్‌ పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో తాను టీడీపీకి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. మోదుగుల అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను ఆయన పంపించారు.ఇదిలావుంటే ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాసరావు, పండుల రవీంద్రబాబు టీడీపీని వీడిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories