విశాఖలో సముద్ర టూరిజానికి తొలి అడుగు

విశాఖలో సముద్ర టూరిజానికి తొలి అడుగు
x
Highlights

విశాఖలో సముద్ర టూరిజానికి తొలి అడుగు పడింది. ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ లైనర్‌ 'సిల్వర్‌ డిస్కవరర్‌' సాగర తీరానికి వచ్చింది. రష్యాలో తయారైన ఈ క్రూయిజ్‌...

విశాఖలో సముద్ర టూరిజానికి తొలి అడుగు పడింది. ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ లైనర్‌ 'సిల్వర్‌ డిస్కవరర్‌' సాగర తీరానికి వచ్చింది. రష్యాలో తయారైన ఈ క్రూయిజ్‌ లైనర్‌ అత్యంత విలాసవంతమైనది. శ్రీలంక నుంచి వచ్చిన ఈ షిప్పులో అమెరికా, యూరోప్, ఇతర దేశాలకు చెందిన 100 మంది పర్యాటకులు ఉన్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను చూపిస్తూ సర్క్యూట్ టూరిజంలా ఈ క్యూయిజ్ లైనర్ సేవలు అందిస్తుంది. సిల్వర్‌ డిస్కవరర్‌ విశాఖ నుంచి గోపాల్ పూర్ మీదుగా పారాదీప్ పోర్టుకు వెళుతుంది. క్రూయిజ్‌ షిప్పులు రావడం కోసం ప్రత్యేక టెర్మినల్ నిర్మించబోతున్నట్లు విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ కృష్ణబాబు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories