Ration New Timings: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్...కొత్త తేదీలు, టైమింగ్స్ ఇవే

Big alert for ration card holders These are the new dates and timings
x

Ration New Timings: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్...కొత్త తేదీలు, టైమింగ్స్ ఇవే

Highlights

Ration New Timings: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి రేషన్ కార్డు పంపిణీ విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ మేరకు తాజాగా పౌరసరఫరాల శాఖ...

Ration New Timings: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి రేషన్ కార్డు పంపిణీ విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ మేరకు తాజాగా పౌరసరఫరాల శాఖ సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఎండీయూ విధానం అమల్లో ఉన్నప్పుడు ఈ ఫోన్లో ఉన్న సాఫ్ట్ వేర్ తొలగించి రేషన్ డీలర్ ద్వారా పంపిణీ కోసం రూపొందించిన సాఫ్ట్ వేర్ క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు విజయవాడ మధురానగర్ రేషన్ డీపూ నెంబర్ 218 ని పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరబ్ తో కలిసి సందర్శించారు. ఈ ఫోన్ లో లాగిన్ నుంచి కార్డు నెంబర్ ఎంట్రీ వరకు కార్డుదారుని వేలిముద్ర, కంటిపాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గతంలో ఎండీయూ వాహనం ఎప్పుడు వస్తుందో..వెళ్తుందో తెలియని దుస్థితి ఉండేదన్నారు. దీంతో కార్డుదారులు రేషన్ కోసం వాహనం కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు కార్డుదారులకు ఆ కష్టాలు ఉండవన్నారు. నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు అలాగే సాయంత్రం 4 నుంచి 8గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారాల్లోనూ రేషన్ పంపిణీ కొనసాగుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories