నారా లోకేష్ కు రాఖీ కట్టిన భూమా అఖిలప్రియ

నారా లోకేష్ కు రాఖీ కట్టిన భూమా అఖిలప్రియ
x
Highlights

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకం రాఖీ పండుగ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఇంట రాఖీ పండుగ ఘనంగా...

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకం రాఖీ పండుగ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఇంట రాఖీ పండుగ ఘనంగా జరిగింది. పలువురు అక్కాచెల్లెళ్లు ఆయనకు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా లోకేష్ కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుని స్వీట్లు పంచారు. ఈ సందర్బంగా సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు లోకేష్. 'కుటుంబంలో ఆడపిల్లల ప్రాధాన్యతనీ, వారిపట్ల మన బాధ్యతని గుర్తుచేసే రాఖీపౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. సోదరీమణులతో రక్ష కట్టించుకున్న సోదరులందరూ వారి వారి రంగాలలో విజయం సాధించాలని, తోడబుట్టిన అక్కచెల్లెళ్ళకు అన్నివేళలా అండగా నిలవాలని కోరుకుంటున్నాను.' అన్నారు. అలాగే ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. 'కొన్ని తరాల పోరాటం... భారతీయులందరి త్యాగం, సహకారం, ఐక్యతవల్లే దేశానికి స్వేఛ్చ లభించింది. అలాంటి జాతీయతా స్పూర్తిని మనలో కలిగించిన మహానుభావులందరినీ స్మరించుకుంటూ... భారతీయులందరికీ 73వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.' అంటూ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories