Rythu Bharosa: ఇవాళ్టి నుంచే రైతు భరోసా జమ: భట్టి విక్రమార్క కీలక ప్రకటన

Rythu Bharosa: ఇవాళ్టి నుంచే రైతు భరోసా జమ: భట్టి విక్రమార్క కీలక ప్రకటన
x

Rythu Bharosa: ఇవాళ్టి నుంచే రైతు భరోసా జమ: భట్టి విక్రమార్క కీలక ప్రకటన

Highlights

భట్టి విక్రమార్క కీలక ప్రకటన: ఇవాళ్టి నుంచే రైతు భరోసా నిధుల జమ!

Rythu Bharosa: రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇవాళ్టి నుంచే వానాకాలం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. రైతునేస్తం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, వ్యవసాయం కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండెబాట అని అన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు ఆపలేదని గుర్తుచేశారు. ఇప్పటివరకు రూ.74 వేల కోట్ల మేర రైతుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. 6 నెలల లోపే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి చూపించిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇచ్చామని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న యాసంగి రైతుబంధు నిధులను ఖాతాల్లో జమ చేశామని వివరించారు.

ఈసారి రైతు భరోసా ఎకరాల వారిగా కాకుండా, వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు ఒకేసారి విడుదల చేస్తామన్నారు. రాబోయే 9 రోజుల్లో అన్నదాతలందరికీ నగదు వారి ఖాతాల్లోకి జమ అవుతుందని తెలిపారు.

సభలో స్పష్టంగా చెప్పారు:

రైతులకు మేలు చేసే ప్రభుత్వం ప్రజల అండను కోరుకుంటుందని, కానీ బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక అసహనంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ చుట్టూ ఉన్నవాళ్లే దెయ్యాలా వ్యవహరిస్తున్నారని, రైతుల భవిష్యత్ కోసం అలాంటి శక్తులను గ్రామాలకు అడ్డుదారిగా రానివ్వొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories