Bandi Sanjay Comments: ఏపీ పాలిటిక్స్‌‌పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Comments:
x

Bandi Sanjay (file image)

Highlights

Bandi Sanjay Comments: * ఏపీలో దేవాలయాల చుట్టూ రాజకీయాలు * ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్‌? * బైబిల్‌ పార్టీ కావాలా... భగవద్గీత పార్టీ కావాలా...?

Bandi Sanjay Comments: తెలంగాణ బీజేపీ సారధిగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాటల తూటలతో హీట్ పెంచిన బండి సంజయ్ ఇప్పుడు ఏపీ రాజకీల పై ఫోకస్ పెట్టారా? ఏపీలోని దేవాలయాల్లో జరుగుతున్న వరుస సంఘటనల పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్స్ చూస్తుంటే ఇప్పుడు ఔననే సమాధానమే వినిపిస్తుంది. త్వరలో జరుగనున్న తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ తరుపున బండి సంజయ్ కీలకపాత్ర పోషించ బోతున్నారా అన్నది ఏపీ రాజకీయాల్లోను ఆసక్తి రేపుతుంది. అయితే తెలంగాణ‌లో సక్సెస్ అయిన బండి సంజయ్ ఫార్ములా ఏపీలో వర్కౌట్‌ అవుతుందా?

Bandi Sanjay Comments: ఉత్తరాదిన పాగ వేసిన బీజేపీ ఎలాగైనా సరే దక్షిణాదిన కూడా కాషాయ జెండాను రెపరెపలాడించాలని చూస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ఎప్పటి నుండో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. తెలంగాణలో ప్రస్తుతం రెండో పార్టీగా ఎదగటానికి పకడ్బంది ప్రణాళికతో ముందుకు సాగుతుంది. గట్టిగా పోరాడితే ఏపీలోనూ బలమైన రాజకీయంగా శక్తిగా ఎదిగే అవకాశం ఉందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఏపీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

ఏపీలో దేవాలయాల చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. రామతీర్ధంలో జరిగిన ఘటనపై ఏపీ బీజేపీ కంటే టీడీపీ ఎక్కువ దూకుడుకనబర్చింది. దీంతో వైసీపీ vs టిడీపీ గానే వివాదం నడవడంతో బీజేపీ కాస్త వెనుకబడింది. జనసేనతో పొత్తున్నప్పటికి బీజేపీ నేతలు సమన్వయం చేసుకోవడంలో విఫలమవ్వడంతో ఢిల్లీ పెద్దలు కొత్త ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ అస్త్రన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందన్న టాక్ ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది. ఏపీలో ఇప్పటికే హిందూ దేవుళ్ళ విగ్రహాల మీద దాడులు, హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారంటూ పెద్ద గొడవలు జరుగుతున్నాయి. బండి సంజయ్ (Bandi Sanjay Comments) లాంటి నేతలు ఎంట్రీ ఇవ్వటానికి ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంటే చాలు రెచ్చిపోవటం ఖాయం.

ఇక ఏపీలో దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు రోడ్డు ఎక్కితే సీఎం జగన్‌, వైసీపీ మూటముల్లె సర్దుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తిరుపతి ఉపఎన్నికలో ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని కోరారు. బైబిల్​ పట్టుకొని ప్రచారం చేసేవారికి ఓటేస్తారా భగవద్గీత పట్టుకునే వారికి ఓటేస్తారా తేల్చుకోవాలని సూచించారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందన్నారు.

త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయాలని బీజేపీ తన మిత్రపక్షమైన జనసేన పార్టీ భావిస్తున్నాయి. అయితే సంజ‌య్ తిరుపతి వెళ్ళి వ‌స్తే ఎవరు పోటీచేసినా ఖచ్చితంగా బలం‌ పెరుగుతోందని కమలం పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ రాజకీయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. తెలంగాణలో ఎంఐఎంను బీజేపీ టార్గెట్ చేస్తూ వస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తోందట. ముఖ్యంగా మత మార్పిళ్లను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయన్న అంశాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకోవాలని చూస్తున్నారట. అయితే తెలంగాణ‌లో సక్సెస్ అయిన బండి సంజయ్ ఫార్ములా ఏపీలో వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories