వారం రోజుల్లో స్పష్టత వస్తుంది : మంత్రి బాలినేని

వారం రోజుల్లో స్పష్టత వస్తుంది : మంత్రి బాలినేని
x
Highlights

పర్చూరు పంచాయితీపై మరోసారి తేల్చేసారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. దగ్గుబాటి కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉంటే బాగుంటుందని సీఎం వైఎస్‌ జగన్‌..

పర్చూరు పంచాయితీపై మరోసారి తేల్చేసారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. దగ్గుబాటి కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉంటే బాగుంటుందని సీఎం వైఎస్‌ జగన్‌.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చెప్పినట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉండాలనే విషయంలో తుది నిర్ణయం దగ్గుబాటిదేనని.. ఆయనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. మరో వారం రోజుల్లో పర్చూరు పంచాయితీపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు బాలినేని. కాగా ఇటీవలి ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పర్చూరు వైసీపీ ఇంఛార్జిగా తన కుమారుడు హితేష్ చెంచురామ్ ను నియమించాలంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే పురందేశ్వరి కూడా వైసీపీలోకి వస్తే ఆమెకు పార్టీలో సముచిత స్థానం తోపాటు హితేష్ కు ఇంచార్జి బాధ్యతలు ఇస్తామని వైసీపీ చెబుతోంది.

ఆ ప్రచారం అవాస్తవం : బాలినేని

ప్రకాశం జిల్లా చిన్నగంజాంలో ఇసుక అక్రమ తరలింపు జరుగుతోందన్న ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి హస్తం ఉన్నట్టు సోషల్ మీడియాలో టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో మంత్రి బాలినేని ఈ ప్రచారంపై స్పందించారు. తన కుమారుడిపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. ఇసుక అక్రమ తరలింపు విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. తన కుమారుడు ఇసుక విషయంలో అసలు తలదూర్చలేదని వెల్లడించారు. కావాలనే టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేస్తన్నారని అన్నారు. తన కుమారుడు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని రుజువులు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. అంతేకాదు రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని మంత్రి చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories