గన్నవరం ఎయిర్‌పోర్టులో రజినీకాంత్‌కు బాలకృష్ణ ఘనస్వాగతం

Balakrishna Welcomes Rajinikanth At Gannavaram Airport
x

గన్నవరం ఎయిర్‌పోర్టులో రజినీకాంత్‌కు బాలకృష్ణ ఘనస్వాగతం

Highlights

* ముఖ్యఅతిథులుగా సినీస్టార్స్ రజినీకాంత్, బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు

Johar NTR: తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను టీడీపీ, నందమూరి ఫ్యామిలీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో భారీ సభకు ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరుకానున్నారు. ఎన్టీఆర్ ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్ ఆవిష్కరించనున్నారు. సభకు టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు భారీగా తరలిరానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ సభ ప్రారంభం కానుంది. ఈ ఉత్సవ సభకు హాజరయ్యేందుకు రజినీకాంత్ ఈపాటికే గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజినీకాంత్‌కు చంద్రబాబు తేనీటి విందు ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories