Balakrishna: ఏపీ రాజకీయాల నుంచి బాలకృష్ణను తప్పించిన టీడీపీ.. తెర వెనుక ఏం జరిగింది..?

Balakrishna Was Removed From AP Politics By TDP
x

Balakrishna: ఏపీ రాజకీయాల నుంచి బాలకృష్ణను తప్పించిన టీడీపీ.. తెర వెనుక ఏం జరిగింది..?

Highlights

Balakrishna: పార్టీ ఆఫీసుకి వెళ్లి బాధ్యతలు తీసుకున్న బాలయ్య

Balakrishna: బాలకృష్ణను ఏపీ రాజకీయాల నుంచి తెలివిగా తప్పించారా...? టీడీపీలో లెటెస్ట్ సీన్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పార్టీ కష్టాల్లో ఉండగా సేవ చేస్తానంటూ ముందుకొచ్చిన బాలయ్య బాబును... ఎత్తి ఏట్లో పడేసినట్లు తెలంగాణ టీడీపీకి పని చేయాలని చెప్పడం చూస్తుంటే... ఇది నిజమే అనిపిస్తోంది.... పార్టీయే సరిగ్గా లేని తెలంగాణలో బాలకృష్ణ లాంటి హీరో ఏం నాయకత్వం వహిస్తారు...? అయినా సరే బాలయ్య పార్టీ ఆదేశాలను శిరసావహించారు.

తెలుగుదేశం అధినేత రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉండడంతో పార్టీకి కష్టకాలం వచ్చింది. సరైన దిశానిర్దేశం చేసే నేత లేకపోవడం, లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోవడంతో పార్టీ గందరగోళంలో పడిపోయింది. ఆ సమయంలోనే పార్టీని నడిపేందుకు తాను రెడీ అని, బాధ్యతలను భుజస్కంధాలపై మోస్తానని బాలయ్య చాలా ఆవేశంతో వెళ్లి హైదరాబాద్‌లోని పార్టీ అఫీసులో చంద్రబాబు సీట్లో కూర్చున్నారు. ఎమర్జెన్సీ మీటింగ్ కూడా నిర్వహించారు. త్వరలోనే రాష్ట్రమంతా బస్సు యాత్ర చేసి చంద్రబాబుకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తానని ఆవేశంగా ప్రకటించారు.

అయితే బాలయ్య ఇంత సానుకూలంగా స్పందించినా... టీడీపీ నేతల్లో ఉత్సాహం మాత్రం రాలేదు. సరి కదా.. భయం వేసినట్లుంది. బాలకృష్ణ ఆగి ఆగి మాట్లాడతారు. సెంటెన్స్‌కి... సెంటెన్స్‌కి చాలా గ్యాప్ తీసుకుని తడబడుతూ... తడుముకుంటూ మాట్లాడతారు. పైగా లోతైన రాజకీయ విషయాలపై ఒక నిర్ణయం తీసుకోవడం, వైఖరి తెలియజేయడం లాంటి విషయాల్లో బాలకృష్ణ చాలా వీక్... దీన్ని గ్రహించిన చంద్రబాబు.. పార్టీ మరో ప్రమాదంలో పడకుండా.. జైలు నుంచే అడ్డుకట్ట వేసినట్లు కనిపిస్తోంది. లోకేష్, చంద్రబాబు ఒకవేళ జైలు పాలయితే పార్టీని బ్రహ్మణితో లేదా... భువనేశ్వరితో నడిపించాలని మొదట భావించినట్లున్నారు. కానీ బ్రహ్మణి పరిపక్వత లేని మాటలు... భువనేశ్వరి తెలుగు మాట్లాడటం రాక పడిన ఇబ్బందులన్నీ అందరూ చూశారు.

ఇలాంటి టైములో బాలకృష్ణ మాత్రం పార్టీకోసం ఏదైనా చేయాలనే తపనతో కనిపించారు. అయితే ఆయన ప్రయత్నాలను యనమల లాంటి సీనియర్లు తెర వెనక నుంచి అడ్డుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి ములాఖత్‌లో యనమల చంద్రబాబుని కలిసినప్పుడు ఈ విషయంపై కాస్త చూసుకోమని చెప్పి ఉంటారని, అప్పటి నుంచే బ్రహ్మణి, భువనేశ్వరి మీడియా ముందుకు రావడం, హడావుడి చేశారని, టీడీపీ వ్యూహాలపై అంచనా ఉన్న వారు చెబుతున్న మాట. అంతేకాదు బాలకృష్ణ వల్ల పార్టీ ఇమేజ్‌కి డ్యామేజ్ జరగకుండా ఉండేందుకే ఆయన్ను పార్టీ తెలంగాణ బాధ్యతలను పర్యవేక్షించాలని చెప్పారని టీడీపీ వర్గాల ఇన్‌సైడ్ టాక్...

బాలయ్య చరిష్మా తెలంగాణలో పార్టీకి ఉపయోగ పడుతుందనుకున్నా.. అది ఉపయోగ పడాల్సిన చోట ఉపయోగ పడనప్పుడు... అవసరంలేని చోట వాడుతున్నప్పుడు... ఏం ఫలితం...? తెలంగాణ టీడీపీలో తాజా పరిణామాలపై తమ్ముళ్ల ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నా.... ఈ పరిణామాలు వైసీపీకి మాత్రం ఉత్సాహాన్నిస్తున్నాయి. ఎన్‌టీఆర్ వారసుడికి పార్టీ పగ్గాలు అప్పగించకుండా.... మరోసారి మోసగించారంటూ విమర్శలు గుప్పిస్తోంది జగన్ పార్టీ.. ఏపీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఉచిత సలహా కూడా పడేశారు.. బాలయ్యా.. లే.. లేచి పగ్గాలందుకో.. ఆ సీట్లో కూర్చో.. ఆ పార్టీకి నువ్వే అసలు వారసుడివి అంటూ.... సాధ్యమైనంతగా ఎగదోశారు...

ఎవరేమనుకున్నా బాలకృష్ణ మాత్రం ఈ మార్పులను, పరిణామాలను గమనించడం లేదు.. పార్టీ చెప్పిన ఆదేశాలను, బాధ్యతలను తు.చ. తప్పకుండా పాటిస్తూ అడుగులేస్తున్నారు. అందుకే తెలంగాణ టీడీపీని పర్యవేక్షణ చేయమనగానే ఎందుకు...? ఏమిటి..? అనే ఆలోచన లేకుండా డ్యూటీలో జాయిన్ అయిపోయారు. ఎవరేమనుకున్నా.. పట్టించుకోకుండా అడుగు ముందుకే వేస్తున్నారు బాలయ్య.... ఎంతన్నా బాలయ్య కదా.. ఒక వైపే చూస్తారు.. రెండో వైపు చూడరు.. చూస్తే బావ ఆగ్రహ జ్వాలల ముందు మాడిపోతామన్న భయమేమో...?

Show Full Article
Print Article
Next Story
More Stories