బోటుకు లంగర్ వేసినా ఇలా జరుగుతుందా!

బోటుకు లంగర్ వేసినా ఇలా జరుగుతుందా!
x
Highlights

బోటుకు లంగర్ వేసినా ఇలా జరుగుతుందా! బోటుకు లంగర్ వేసినా ఇలా జరుగుతుందా!

రెండు వారాల క్రిందట గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బోటు వెలికితీత ఆపరేషన్ ఆదివారం నుండే ప్రారంభమైంది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్ సంస్ధ బోటు వెలికితీత పనిని చేపడుతోంది. మూడు రోజుల్లో బోటును వెలికి తీస్తామని బాలజీ మెరైన్ యాజమాని ధర్మాడి సత్యం తెలిపాడు. బోటు దాదాపు 300 అడుగుల లోతులో ఉండటం వలన లంగర్ వేసి లాగేందుకు ప్రయత్నించినా.. నది ప్రవాహానికి తాడు పక్కకు కదిలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 25 మందిలో కొంతమంది నీళ్ళలోకి ఆక్సిజన్ పెట్టుకొని బోటు దగ్గరికి వెళ్లేందుకు ప్రయతినిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది వారిని అనుసరించి త్రేడ్ ను జేసీబీతో అనుసంధానం చేసేందుకు నేలను చదును చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం నీటిలోకి వారు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories