Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్‌

Bail Granted to Bandaru Satyanarayana
x

Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్‌

Highlights

Bandaru Satyanarayana: రూ.25వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన మొబైల్ కోర్టు

Bandaru Satyanarayana: టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి బెయిల్ మంజూరైంది. మంత్రి రోజాను దూషించారంటూ వైసీపీ నాయకులు ఆయనపై ఫిర్యాదు చేయడంతో నగరిపాలెం పోలీసులు కేసు నమోదు చేసి, ఈ నెల 2న అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం జీజీహెచ్‌లో బండారుకు వైద్య పరీక్షలు నిర్వహించి, మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రూ.25వేల పూచీకత్తుపై న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్‌పై విడుదలైన బండారు మాట్లాడుతూ... అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంపై తనకు నమ్మకం ఉందని, అదే రాజ్యాంగ ప్రకారం తనకు కోర్టులో న్యాయం జరిగిందన్నారు. ధర్మం గెలుస్తుందని, న్యాయం నిలుస్తుందన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా త్వరలో బెయిల్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసినప్పటి నుంచి లోకేశ్ అండగా నిలిచారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories