డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు ఏపీ ప్రభుత్వం షాక్..

డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు ఏపీ ప్రభుత్వం షాక్..
x
Highlights

మనందరికీ వాహనాలు ఉండటం సహజం. అయితే అందులో చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు వాహన పత్రాలు లేకపోవడం సహజమే, కానీ ఇది నేరం. తెలుగు రాష్ట్రాల్లో,...

మనందరికీ వాహనాలు ఉండటం సహజం. అయితే అందులో చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు వాహన పత్రాలు లేకపోవడం సహజమే, కానీ ఇది నేరం. తెలుగు రాష్ట్రాల్లో, పోలీసులు ఇలాంటి వాటి వైపు చూడటం తగ్గించేశారు. లైసెన్స్ లేనివారికి చిన్న మొత్తంలో జరిమానాలు విధించి వదిలేస్తున్నారు. ఫిట్ నెస్ లేకుండా వాహనాలను నడపడంతో ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఆర్టీఓ ఆఫీసర్లు కూడా వీటిపై పెద్దగా ద్రుష్టి సారించడం లేదు. దాంతో లైసెన్స్ లేని వాహనాలు యథేచ్ఛగా రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయాలనీ ఆర్టీఓ అధికారులకు రవాణా శాఖా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు అటువంటి వాహనాలకు భారీ జరిమానాతో పాటు, జైలుకు కూడా పంపించేలా చర్యలు చేపట్టింది. 2019 లో, 88,872 మంది డ్రైవర్లు.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడుపుతున్నట్లు కనుగొన్నారు. ఈ విషయాన్ని రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీకి నివేదించారు.

దీనిని సుప్రీంకోర్టు కమిటీ తీవ్రంగా పరిగణించింది. 'ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రజలు ఎందుకు వాహనాలు నడుపుతున్నారు?, దీనిపై ప్రభుత్వం ఎందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవడం లేదు' అని సుప్రీంకోర్టు కమిటీ ప్రశ్నించింది. దాంతో కఠిన నిర్ణయాలు అమలు చేయాలనీ రవాణా శాఖ నిర్ణయించింది. అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్ జారీలో నూతనంగా మార్పులు తీసుకొచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం మరింత ఈజీ ప్రాసెస్ ను అందుబాటులోకి తెచ్చింది. లైసెన్స్ పొందటానికి కనీస అర్హత 8వ తరగతికి తగ్గించింది. అంతేకాదు సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు కూడా త్వరలో అమలు చేయాలనీ నిర్ణయించింది. ఒక్కసారి ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత 30 సంవత్సరాలు వరకు చెల్లుబాటు అవుతుందని.. కాబట్టి దరఖాస్తు చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories